నల్లగొండ జిల్లా:కన్నకూతురును ఉరేసి చంపి తానూ ఉరేసుకుని ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.టూ టౌన్ సీఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాచర్లకు చెందిన కాటయ్య,జ్యోతి దంపతులు రెండు నెలల క్రితం మిర్యాలగూడకు వలస వచ్చి సీతారాంపురంలో నివాసం ఉంటున్నారు.
కాటయ్య తాపీమేస్త్రిగా పనిచేస్తూ జీవిస్తున్నారు.వారికి కుమారుడు,కూతురు ఉన్నారు.
కాగా రెండు రోజుల క్రితం కాటయ్య స్వగ్రామం ఆంధ్రాకు వెళ్ళాడు.ఓ కేసులో నిందితుడిగా ఉన్న కాటయ్యను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు.
ఆ విషయం తెలుసుకున్న భార్య జ్యోతి తన కూతురు అమ్ములు (4) ఉరివేసి చంపి,అనంతరం ఆమె కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.