బాధిత రైతులను ఆదుకుంటాం:ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి...!

నల్లగొండ జిల్లానాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోన తిరుమలగిరి(సాగర్) మండలం జాల్ తండాలో రెండు రోజుల క్రితం ఈదురు గాలులతో విద్యుత్ సర్క్యూట్ కారణంగా కొంత మంది రైతుల గడ్డి వాములు(పశు గ్రాసం)దగ్ధమైన

 We Will Support The Affected Farmers: Mlc Mc Kotireddy , Mlc Mc Kotireddy , Fa-TeluguStop.com

విషయం తెలుసుకొని నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ ఎంసి కోటిరెడ్డి స్థానిక మండల ఎంపిపి,జడ్పీటిసిలతో కలిసి ఆదివారం బాధిత కుటుంబాలను పరామర్శించారు.అనంతరం దగ్ధమైన గడ్డి వాములను పరిశీలించి, తక్షణమే అధికారులతో మాట్లాడారు.

అధికారులు స్పందించి వెంటనే పరిశీలించి,ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని చెప్పారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూప్రభుత్వం తరుపున బాధిత రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో\ఎంపిపి భగవాన్ నాయక్, జడ్పీటిసి సూర్య భాష నాయక్,స్థానిక సర్పంచ్ జటవత్ స్వామి నాయక్, నెల్లికల్ సర్పంచ్ జనార్దన్ రెడ్డి,మాజీ మండల అధ్యక్షులు బి.వి రమణ రాజు,నందికొండ మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్ రామకృష్ణ ఆర్.కె, బిలు నాయక్,పాండు నాయక్,తండా వాసులు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube