భారతీయ రైల్వే( Indian Railways ) రైలు ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త సర్వీసులను పరిచయం చేస్తుంటుంది.అంతేకాదు, అద్భుతమైన ఆఫర్లను అందిస్తూ వారిని ఫిదా చేస్తుంటుంది.
ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ ఎల్లప్పుడూ ఏదో ఒక మంచి సదుపాయాన్ని అందుబాటులో ఉంచుతూనే ఉంటుంది.కానీ వాటి గురించి చాలామందికి తెలియక వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు.
నిజానికి భారతీయ రైల్వే ఫ్రీగా భోజనం( Free Food ) కూడా అందిస్తుంది.ఉచితంగా ఫుడ్ ఆఫర్ చేయాలనే నిర్ణయాన్ని భారతీయ రైల్వే చాలా రోజుల క్రితమే తీసుకుంది.
అయితే ఉచితంగా భోజనం అందరికీ అందించడం చాలా కష్టం.అందుకే ఈ రైల్వే సంస్థ కొందరికి మాత్రమే ఫ్రీగా ఫుడ్ ఆఫర్ చేస్తోంది.

భారతీయ రైల్వేలో దురంతో, శతాబ్ది, రాజధాని ఎక్స్‌ప్రెస్ లాంటి ప్రీమియం రైళ్లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.సాధారణంగా ఈ రైళ్లు ఎలాంటి ఆలస్యం లేకుండా సరైన సమయానికి నడుస్తుంటాయి.ఒక్కోసారి మాత్రం ఆలస్యం అవుతుంటాయి.సాధారణంగా ట్రైన్ ఆలస్యం అయితే దిగాల్సిన స్టేషన్‌కి చేరుకోవడం కూడా ఆలస్యం అవుతుంది.దీనివల్ల సమయానికి ఫుడ్ తినడం కుదరదు.అలాంటప్పుడు ప్రయాణికులు( Railway Passangers ) ఇబ్బంది పడే అవకాశం ఉంది.
ముఖ్యంగా భోజనం విషయంలో వారికి ఇబ్బందులు ఎదురు కావచ్చు.

ఈ ఇబ్బందిని గుర్తించిన భారతీయ రైల్వే వారికి ఉచితంగా భోజనం ఆఫర్ చేయాలని నిర్ణయించింది.అయితే రెండు గంటలకన్నా ఎక్కువ ఆలస్యమైన ప్రీమియం ట్రైన్‌లలోనే ఈ ఫ్రీ ఫుడ్‌ను ఇండియన్ రైల్వే అందిస్తుంది.భోజనంతో పాటు డ్రింక్స్ కూడా అందిస్తుంది.
ఏ సమయంలో ఈ ప్రీమియం ట్రైన్లు ఆలస్యంగా నడిచినా, ప్రయాణికులు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్ వంటివి ఫ్రీగా అందుకోవచ్చు.ఈసారి మీరు పైన పేర్కొన్న ట్రైన్లు ఆలస్యమై ఉంటే అందులో మీరు ప్రయాణిస్తూ ఉంటే ఫ్రీ ఫుడ్ సర్వీస్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు.







