నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు రోజుల్లో మొత్తం 2,747 నామినేషన్లు దాఖలయ్యాయి.మంచి ముహూర్తం ఉండడంతో గురువారం ఒక్క రోజే 1,129 దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికార కార్యాలయం తెలిపింది.
ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల( Assembly elections ) కోసం ఈ నెల 3న నోటిఫికేషన్ జారీ అయింది.అదే రోజు నుంచి నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ మొదలైంది.
నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది.ఈ రోజు చివరి రోజు కావడంతో భారీ స్థాయిలో నామినేషన్లు వచ్చే అవకాశముందని సీఈఓ ఆఫీస్ అంచనా వేస్తున్నది.
నోటిఫికేషన్ ( Notification )ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 3.00 గంటలకు నామినేషన్ల ప్రక్రియ క్లోజ్ కానున్నది.ఇప్పటివరకు సీఈఓ ఆఫీస్ మీడియాకు ఇచ్చిన గణాంకాలకు వెబ్‌సైట్‌లో నమోదు చేసిన లెక్కలకు కాస్త తేడా నెలకొన్నది.దీనిపై సీఈఓ ఆఫీస్ శుక్రవారం సాయంత్రం తర్వాత క్లారిటీ ఇవ్వనున్నది.
సీఈఓ ఆఫీస్ వెలువరించిన గణాంకాలను పరిశీలిస్తే గరిష్టంగా గురువారం 1,129 దాఖలైనట్లు తేలింది.అధికారికంగా వెల్లడించిన గణాంకాల ప్రకారం ఇప్పటివరకు మొత్తం 2,647 నామినేషన్లు మాత్రమే వచ్చినట్లు స్పష్టమవుతున్నది.
కానీ, వెబ్‌సైట్ లెక్కల ప్రకారం మాత్రం ఇది 2,747 గా ఉంది.పలువురు అభ్యర్థులు ఒకటికంటే ఎక్కువ నామినేషన్లు దాఖలు చేశారు.
దీంతో అభ్యర్థుల సంఖ్య నామినేషన్లతో పోలిస్తే తక్కువగానే ఉండనున్నది.డెడ్‌లైన్ ముగిసిన తర్వాత నిర్దిష్టంగా ఎంత మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారో,ఒక్కో అభ్యర్థి సగటున ఎన్ని దాఖలు చేశారో,గరిష్టంగా ఏ నియోజకవర్గంలో ఉన్నాయో స్పష్టం కానున్నది.
అన్ని విషయాలు సీఈఓ ఆఫీస్ ఈరోజు సాయంత్రం మీడియాకు వెల్లడించనుంది
.