కేటీఆర్ కు ఎంపీ కోమటిరెడ్డి లేఖ

యాదాద్రి జిల్లా:చేనేత మిత్ర సబ్సిడీ 6 నెలలుగా రాకపోవటంపై మంత్రి కేటీఆర్ కి భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగ లేఖ వ్రాసారు.చేనేత మరియు అనుబంధ కార్మికులకు చేనేత మిత్ర పథకం కింద రావాల్సిన 40% సబ్సిడీ 6 నెలలు దాటినా రావటం లేదు దింతో చేనేత కార్మికులు ఇల్లు గడవక ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత మిత్ర పథకం ద్వారా కార్మికులు పట్టు నూలు కొనుగోలు చేశారు.2 నెలలకు ఒక్కసారి అందవాల్సిన సబ్సిడీ 6 నెలలు అయిన అందటం లేదని,పట్టు కొనుగోలు చేసి 6 నెలలు గడిచినా వారికి అందవాల్సిన 40% సబ్సిడీ రావడం లేదని, పట్టు నూలు 1 కేజీ 6000కి పెరగిడంతో మాస్టర్ కార్మికులకు పని కలిపోయించలేక మగ్గాలు బంద్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.పనిలేక చేనేత కార్మికుల ఇల్లు గడవడం కూడా గగనం అయ్యిందన్నారు.

చేనేత కార్మికులు 1కేజీ పట్టు నూలు ధారంను 6000 రూపాయలు పెట్టి మార్కెట్లో కొంటున్నారు.సబ్సిడీ మాత్రం ప్రభుత్వం 4700 రూపాయలకు మాత్రమే ఇస్తుందని తెలిపారు.

త్వరలోనే ఈ సమస్యని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

కాబోయే కొత్తజంటలకు లగ్గాల బ్రేక్...మూడు నెలలు ముహూర్తాలు లేనట్లే...!
Advertisement

Latest Nalgonda News