హార్మోన్ బ్యాలెన్స్‌కు ఉప‌యోగ‌ప‌డే సూప‌ర్ స్మూతీ ఇది..త‌ప్ప‌కుండా తీసుకోండి!

హార్మోన్ ఇమ్‌బ్యాలెన్స్ లేదా హార్మోన్ అసమతుల్యత.ఇటీవల రోజుల్లో చాలా మందిని కలవర పెడుతున్న సమస్య ఇది.

 This Is A Super Smoothie For Hormone Balance , Super Smoothie, Hormone Balance,-TeluguStop.com

పీసీఓడీ, సంతానలేమి, డయాబెటిస్, హైపోథైరాయిడ్ వంటి దీర్ఘకాలిక జబ్బులన్నిటికీ హార్మోన్ ఇమ్‌బ్యాలెన్స్ ప్ర‌ధాన కారణంగా నిలుస్తుంటుంది.ఇవే కాకుండా బరువు అధికంగా పెరగడం లేదా తగ్గడం, నీరసం, అలసట, మలబద్ధకం, డిప్రెషన్, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవడం, నిద్రలేమి తదితర సమస్యలు కూడా హార్మోన్ ఇమ్‌బ్యాలెన్స్ వ‌ల్ల ఎదురవుతాయి.

అందుకే హార్మోన్ బ్యాలెన్స్ కు సహాయపడే ఆహారాల‌ను డైట్ లో చేర్చుకోవాలి.అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ స్మూతీ కూడా హార్మోన్ బాలన్స్ కు అద్భుతంగా ఉపయోగపడుతుంది.

పైగా ఈ స్మూతీని రెగ్యులర్ గా తీసుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ సైతం లభిస్తాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీ ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ లో ఐదు జీడిపప్పులు, రెండు డ్రై అంజీర్, ఐదు బాదం పప్పులు వేసుకుని వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.అలాగే మరో గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ మరియు వాటర్ వేసుకుని గంట పాటు నానబెట్టుకోవాలి.

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న ఓట్స్, బాదం పప్పులు, జీడిపప్పులు, అంజ‌ర్‌ వేసుకోవాలి.వాటితో పాటు పావు టేబుల్ స్పూన్ అల్లం పొడి, చిటికెడు మిరియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ అశ్వగంధ పొడి, పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి, రెండు ఫ్రెష్ టర్మరిక్ స్పైసెస్ వేసుకుని కొద్దిగా వాటర్ పోసి మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Tips, Hormone Balance, Hormonebalance, Latest, Smoothie-Telugu Health Tip

ఇప్పుడు స్ట‌వ్‌ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ పాలు పోయాలి.పాలు కాస్త హిట్ అవ్వగానే అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు మ‌రిగించి సర్వ్ చేసుకుంటే స్మూతీ సిద్ధమయినట్టే.ఈ స్మూతీని ఉదయం సమయంలో తీసుకుంటే హార్మోన్ బ్యాలెన్స్ జరుగుతుంది.తద్వారా వెయిట్ లాస్ అవుతారు.నీరసం, అలసట దూరం అవుతాయి.పీసీఓడీ, సంతానలేమి వంటి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పకుండా ఉంటాయి.రక్తంలో కొలెస్ట్రాల్ త‌గ్గి గుండె ఆరోగ్యంగా మారుతుంది.

మరియు ఎముకలు దృఢంగా సైతం తయారవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube