నల్లగొండ జిల్లా:తెలంగాణ అసెంబ్లీలో నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.బషీర్ బాగ్,నాంపల్లి,రవీంద్రభారతి పరిసరాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.
నిరసనలు, ర్యాలీలు,ధర్నాలకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు.
బుధవారం ఉదయం 11 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ ఉభయ సభలు నుద్దేశించి వర్మ ప్రసంగించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రగతిపై గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు.బీఆర్ఎస్ నినాదాల మధ్య గవర్నర్ ప్రసంగం ముగిసింది.