నల్లగొండ జిల్లా:దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెం గీత కార్మికుల కుటుంబానికి చెందిన పెండెం శ్రీను, సాయమ్మ దంపతుల కుమారుడు సందీప్ ఓపెన్ డిగ్రీ చదివి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన గ్రూప్-2, గ్రూప్-3 ఫలితాలలో సత్తా చాటాడు.గ్రూప్-2 లో 85వ, ర్యాంక్,గ్రూప్-3లో 50వ, ర్యాంక్ సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.గ్రూప్స్ లో మెరుగైన ప్రతిభ కనబరిచిన సందీప్ కు తల్లిదండ్రులు,కుటుంబసభ్యులు,గ్రామస్థులు శుభాకాంక్షలు తెలిపారు.




Latest Nalgonda News