నల్లగొండ జిల్లా:పోలీస్ నియామక మండలి సూచనల ప్రకారం రేపు నిర్వహించనున్న పోలీస్ కానిస్టేబుల్ తుది పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ అపూర్వరావు తెలిపారు.పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్షా కేంద్రాల వద్దకు గంట ముందుగానే చేరుకోవాలని సూచించారు.
రాత పరీక్ష కోసం నల్లగొండ పట్టణ కేంద్రంలో 25 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందని తెలిపారు.
ఉమ్మడి జిల్లా నుంచి 11,239 మంది అభ్యర్థులు పరీక్షకు అర్హత సాధించారని వివరించారు.పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడం జరిగుతుందని,పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్స్, ఇంటర్ నెట్ సెంటర్స్ అన్ని మూసి వేయాలని,పరీక్ష సెంటర్స్ వద్ద నుండి 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దని తెలిపారు.
పరీక్ష నిర్వహణకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష రాసే అభ్యర్థులకు సూచనలు ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించబడదు.
అభ్యర్థులు తమ హాల్ టికెట్ పై పాస్ పోర్ట్ సైజ్ ఫోటో అంటించుకొని రావాలి.లేనిచో పరీక్షకు అనుమతించరు.
అభ్యర్థులు తమ హాల్ టికెట్ లో అన్ని వివరాలను సరి చూసుకోవాలి.పరీక్షా కేంద్రంలోకి బ్యాగులు,సెల్ ఫోన్లు, ఏలక్రానిక్ వాచీలు, క్యాలిక్యులేటర్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దు.
పరీక్షకు బయోమెట్రిక్ వేలిముద్రల హాజరు నమోదు చేస్తారు.కాబట్టి మెహిందీ, టాటూలూ పెట్టుకోవద్దు.
పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ జారీ చేసిన హాల్ టికెట్, బ్లాక్,బ్లూ పెన్ మాత్రమే తీసుకురావాలి.పరీక్ష వేళలు ముగిసేవరకు అభ్యర్థులు హాల్ లోనే ఉండవలెను.
ఒకసారి పరీక్షా హాలులోకి అనుమతించిన తరువాత పరీక్ష పూర్తి అయిన అనంతరం మాత్రమే బయటకు అనుమతిస్తారు.