బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి క్షమాపణ చెప్పాలి:రజక సంఘం

నల్లగొండ జిల్లా:తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో విస్నూర్ దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డిపై తిరుగుబాటు జెండా ఎగరేసి,నీ బాంచన్ దొర కాల్మొక్త అనే రోజుల్లో విరోచితంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ,మరియు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేసి,వారి త్యాగాలను కించపరిచే విధంగా చిన్న ఘటన అంటూ అవమానపరిచిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి తక్షణమే తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని రజక సంఘం రాష్ట్ర నాయకులు నల్లగంతుల నాగభూషణం డిమాండ్ చేశారు.గురువారం మిర్యాలగూడ పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునే విధంగా తెలంగాణ సాయుధ పోరాట యోధుల గురించి బీజేపీ నాయకులు చులకనగా మాట్లాడటం సిగ్గుచేటని పేర్కొన్నారు.

 Bjp Spokesperson Prakash Reddy Should Apologise: Rajaka Sangam-TeluguStop.com

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాడు చాకలి ఐలమ్మ చేసినటువంటి వీతోచిత పోరాటం,ఆమె చేసినటువంటి త్యాగం గురించి,అదే విధంగా సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కోమరయ్య త్యాగం గురించి కించపరిచే విధంగా మాట్లాడటం బీజేపీ నాయకులకు తగదని హితవు పలికారు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కానీ,తెలంగాణ మలిదశ ఉద్యమంలో కానీ,ఏ పాత్ర లేని బీజేపీ నాయకులు అమరుల త్యాగాలను కించపరచడాన్ని నల్లగొండ జిల్లా రజక సంఘం నుండి తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాకలి ఐలమ్మ పోరాటాన్ని గుర్తించి హైదరాబాదు నడిబొడ్డులో ఎకరం స్థలంలో ఐలమ్మ భవనం ఇవ్వడం జరిగిందని, రజకులకు ఉచిత విద్యుత్ మీటర్లతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.బీజేపీ ప్రభుత్వం కానీ,నాయకులు కానీ,రజకులకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు.

ఐలమ్మ స్ఫూర్తిని కించపరిచే విధంగా రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనుకకు తీసుకోని,బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే రజక సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు,రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా రజక సంఘం నాయకులు జంజరాల నాగరాజు,రాజశేఖర్,శీను,వెంకటయ్య,సైదులు, భిక్షం,శివ,గోపి,జానకిరాములు,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube