నల్లగొండ జిల్లా:నీ కుమారుడు,కుమార్తె డ్రగ్ కేసులో దొరికారని,వారిపై కేసు నమోదైందని, మీరేదైనా మాట్లాడుకొని విడిపించుకోవాలని, లేనిపక్షంలో వారి భవిష్యత్ అగమౌతుందని వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్ కోరారు.శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ మేము సీబీఐ ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నామని వచ్చే ఫోన్ కాల్స్ కు ప్రజలు,విద్యార్థుల తల్లిదండ్రులు స్పంచవద్దని పేర్కొన్నారు.ఈనెల 12న ఒకసారి,16న ఒకసారి నాకు స్వయంగా ఫోన్ చేశారని నేను తీవ్రంగా వాళ్ళతో వాగ్వాదం పెట్టుకోవడంతో ఫోన్ కట్ చేశారని చెప్పారు.12న 923306098878 నెంబర్ తో,16న 923281561189 ఫోన్ నెంబర్ల నుండి ఫోన్ చేసి బెదిరించినట్లు చెప్పారు.వాళ్ళు వాట్స్ అప్ కాల్స్ చేస్తున్నారని ఆందోళన చెందాల్సిన,భయపడాల్సిన అవసరం లేదన్నారు.అటువంటి ఫోన్ కాల్స్ పట్ల జాగ్రతలు వుండాలని కోరారు.తాను సీరియస్ గా హిందీలో,ఇంగ్లీష్ లో మాట్లాడడంతో ఫోన్ కట్ చేశారని చెప్పారు.
Latest Nalgonda News