వారం రోజుల్లో వచ్చే ఫ్రీ కరెంట్ అందరికీ అందేనా...?

నల్లగొండ జిల్లా: రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని కేసీఆర్ సర్వనాశనం చేశారని, కేసీఅర్ విద్యుత్ శాఖకు డబ్బులు చెల్లించకపోవడంతో డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయని, అయినా ఫిబ్రవరి నుంచి 200 యూనిట్ల వరకు ప్రజలందరికీ ఉచిత కరెంట్ ను అమలు చేస్తామని మంగళవారం గాంధీభవన్ లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశం అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో తెలిపిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులను ఓ అనుమానం వెంటాడుతుంది.

 Does Everyone Get The Free Current That Comes During The Week, Free Current , M-TeluguStop.com

గతంలో విద్యుత్ బకాయిలు లేకుండా ఉన్నవారికే ఉచిత కరెంట్ వర్తిస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో మరో వారం రోజుల్లో ప్రారంభమయ్యే ఉచిత కరెంట్ కు ఇంకేమైనా సాంకేతిక అడ్డంకులు ఉండే అవకాశం ఉందా? లేదా అందరికీ అమలు చేస్తారా అనే సందిగ్ధంలో పడ్డారు.ఈ విషయంలో విద్యుత్ అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేస్తే ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలిగిపోతాయని భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube