నల్లగొండ జిల్లా: కనగల్ మండలం జి.యడవల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనం పేరుతో నలబైదు ఎకరాల పట్టా భూములు లాక్కొని ఇరవై రైతు కుటుంబాల రైతులని రోడ్డున పడేసిన నల్గొండ జిల్లా బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు, రైతులు పండించే పచ్చటి పంట పొలాలను నాశనం చేసి అదే భూముల్లో కేటీఆర్ బర్త్ డే సెలెబ్రేషన్స్ చేయడం ఎంత వరకు సమంజసమని బాధిత రైతు కుటుంబాలు దుమ్మెత్తిపోశారు.
మీకు,మీ రైతు పక్షపాత బీఆర్ఎస్ పార్టీకి ఇదేనా గొప్ప గౌరవమని ప్రశ్నించారు.రైతులు పండించే పంట పొలాలు ప్రకృతి వనం కాదా?రైతుల పంట పొలాలు ప్రకృతిని నాశనం చేస్తాయా?

రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రకృతి వనం ఎందుకు? దేశానికి అన్నం పెట్టే రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం,రైతుల భూములు లాక్కొని తెరాస అంటే తెలంగాణ రైతు సమితి చెప్పుకోవడం సిగ్గుచేటని, జి.యడవల్లి భూములపై కేసీఆర్, కేటీఆర్ రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.బంగారు తెలంగాణ పేరుతో రైతుల భూముల్ని గుంజుకోని మీ బ్రతుకులు బంగారం చేసుకోవడమేనా?అని నిలదీశారు.కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గుంజుకున్న రైతుల భూములను రైతులకు తిరిగి ఇచ్చి వారికి జీవనాధారం కల్పించాలని,లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో ఓటమి తప్పదని హెచ్చరించారు.