ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్దం

నల్లగొండ జిల్లా:అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా మహిళా గవర్నర్ ను అవమానించడాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ బీజేపీ నకిరేకల్ పట్టణ అధ్యక్షులు పల్స శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్దం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కార్యదర్శి పోతులపాటి అరుణ హాజరై ప్రసంగించారు.

 Chief Minister Kcr Burns The Effigy-TeluguStop.com

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగం లేకుండానే శాసన సభలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం పట్ల భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పిన ముఖ్యమంత్రి,నేడు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినందుకు ఆ సీట్లో ఉండే అర్హత లేదన్నారు.50 ఏళ్ల సాంప్రదాయాన్ని సీఎం కేసీఆర్ తుంగలో తొక్కారని,గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ ప్రవేశ పెట్టి శాసనసభ నియమాలను ఉల్లంఘించి కేసీఆర్ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.గవర్నర్ కే మాట్లాడే హక్కు లేకపోతే, సభలో సభ్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

భారత రాజ్యాంగాన్ని అవమాన పరిచే విధంగా శాసన సభలో గవర్నర్ ప్రసంగం లేకుండా శాసన సభ సమావేశాలు నిర్వహించడం భారత రాజ్యాంగాన్ని అవమాన పరిచినట్లే అని అన్నారు.ప్రస్తుత శాసన సభ సమావేశాలలో లక్ష రూపాయల రుణమాఫీనీ వెంటనే అమలు చేయాలని,బిజెపి శాసన సభ్యులను సస్పెండ్ చేయడాన్నీ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్సి మోర్చా జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్,ఎస్సి మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా డాకయ్య,జిల్లా కార్యవర్గ సభ్యులు పాలడుగు నగేష్,మాజీ జిల్లా కార్యవర్గ సభ్యులు పుట్ట వెంకన్న,మాజీ మండల అధ్యక్షులు తాటికొండ రామూర్తి,ఊట్కూరి కృష్ణ,అప్పం అంజయ్య,పెండెం చంద్రమోహన్,చినేని జానీ,నర్సింగ్ సుధాకర్ గౌడ్, గడ్డం వేణుగోపాల్ రెడ్డి,కోట శ్రీను,గోలి మహేశ్వరి గ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube