బాలీవుడ్ ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూసర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బోనికపూర్ తాజాగా సౌత్ సినిమాలపై ప్రశంసలు కురిపించారు.ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బోనీ కపూర్ సినిమాల గురించి మాట్లాడుతూ భారతీయ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ బాలీవుడ్ అని భావించే రోజులు ఎప్పుడో పోయాయని ఈయన బాలీవుడ్ చిత్ర పరిశ్రమ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇక బాలీవుడ్ సినిమాల విషయానికి వస్తే ప్రేక్షకులకు ఏది కావాలో అది మాత్రమే దొరుకుతుంది. కానీ సౌత్ సినిమాలలో అలా కాదు మనకు నచ్చినది మాత్రమే కాకుండా ఇంకా ఎంతో వినోదాత్మకంగా ప్రేక్షకులకు సందడి చేస్తున్నాయి.
సౌత్ సినిమాలతో పోలిస్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేక్షకులకు కావలసినంత కంటెంట్ రాలేదని ఆయన వెల్లడించారు.ప్రస్తుత కాలంలో దక్షిణాది సినిమాలు భారతీయ ప్రేక్షకుల కోసమే తీసినవిగా ఉంటున్నాయంటూ బోనీకపూర్ వెల్లడించారు.
దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో మలయాళ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ చిత్రాలు సైతం ఓటీటీలో విడుదలవుతూ డిజిటల్ ప్లాట్ ఫామ్ ని శాసిస్తున్నాయి.ఇక కన్నడ తెలుగు చిత్ర పరిశ్రమలు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టు కుంటున్నాయి.

ఇక కరోనా వంటి విపత్కర సమయంలో థియేటర్లు మూత పడటంతో తెలుగు సినిమాలు థియేటర్లకు ప్రాణం పోస్తున్నాయని చెప్పవచ్చు.తమిళ సినిమాలు డబ్బింగ్ వెర్షన్లతో నార్తిండియా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమతో పోలిస్తే దక్షిణాది సినిమాలే నిజమైన భారతీయ సినిమాలనీ బోనీ కపూర్ సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక ఈయన నిర్మాతగా బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాలను నిర్మించి బిజీగా ఉన్నారు.