అందం కనిపించాలనే కోరిక అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు ఉంటుంది.ఎలాంటి మచ్చ, మొటిమ లేకుండా చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలని క్రీమ్, సీరం, మాయిశ్చరైజర్ తదితర ఉత్పత్తులను కొనుగోలు చేసి వాడుతుంటారు.
అయితే వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో తెలియదు గానీ.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని పాటిస్తే మాత్రం ముఖంతో పాటు మెడ కూడా అందంగా, ఆకర్షణీయంగా మెరిసిపోవడం ఖాయం.
మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సింపుల్ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్ వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ తేనె, వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్( Sweet Almond Oil ), వన్ టేబుల్ స్పూన్ పెరుగు మరియు మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలు వేసుకుని స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖం మరియు మెడకు అప్లై చేసుకుని.
ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.పూర్తిగా చల్లారిన తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.
రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే.చర్మంపై మొండి మచ్చలు, మొటిమలు( Pimples ) మాయం అవుతాయి.
స్కిన్ టైట్ గా, బ్రైట్ గా మారుతుంది.స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.

అంతేకాదు, ఈ రెమెడీని పాటిస్తే చర్మంపై పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్( Dead Skin Cells ) తొలగిపోతాయి.డ్రై స్కిన్ సమస్య దూరం అవుతుంది.చర్మం మృదువుగా, కోమలంగా మారుతుంది.మెడపై ఏమైనా నలుపు ఉంటే తొలగిపోతుంది.నెక్ వైట్నింగ్( Neck whitening ) కు కూడా ఈ రెమెడీ ఉత్తమంగా సహాయపడుతుంది.కాబట్టి, ముఖంతో పాటు మెడ కూడా అందంగా మెరిసిపోవాలని భావించే వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.