నల్లగొండ జిల్లా:ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.రాగల రెండు రోజులు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్నం తెలిపారు.
గడిచిన 24 గంటల్లో ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు.రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్,ఆ తరువాత రెండు రోజులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామని వెల్లడించారు.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు సాధారణం కన్నా 45శాతం ఎక్కువగా వర్షపాతం నమోదైందని వివరించారు.రాగల మూడు గంటల్లో ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీమ్,జగిత్యాల,నిజామాబాద్,కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల,మంచిర్యాల,కరీంనగర్,హనుమకొండ, సిద్దిపేట,వరంగల్,మహబూబాబాద్,సూర్యాపేట, మెదక్,సంగారెడ్డి,వికారాబాద్,రంగారెడ్డి, హైదరాబాద్,మేడ్చల్ మల్కాజ్‌గిరి,యాదాద్రి భువనగిరి,జనగామ,నల్గొండ,నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్,నారాయణ్‌పేట్,వనపర్తి,జోగులాంబ గద్వాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం పేర్కొంది.