నల్లగొండ జిల్లా:మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ముగుస్తున్న తరుణంలో,ఆదివారం చండూరు లో సీఎం బహిరంగ సభ పెట్టిన తెల్లారే ఊహించని రీతిలో జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పీఏ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఐటి దాడులు కలకలం రేపాయి.సోమవారం రాత్రి నల్లగొండ జిల్లా కేంద్రంలోని తిరుమలనగర్ లోని ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఐటి అధికారులు ఆకస్మికంగా దాడి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఐటి అధికారులు సోదాల్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచార అందుతుంది.సుమారు రెండు గంటల నుండి ఇంట్లో ఐటి సోదాలు జరుగుతున్నాయి.
ఇంట్లో నుండి బయటికి,బయటి నుండి ఇంట్లోకి ఎవరూ రాకుండా పోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు.ఇంకా ఐటి అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.
ఐటి సోదాలు ఉప ఎన్నికపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు,టీఆర్ఎస్ శ్రేణులు కూడా అభిప్రాయపడుతున్నారు.ఐటి అధికారుల వెల్లడించే వివరాల కోసం యావత్తు రాష్ట్రం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది.