తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి అర్ధరాత్రి నుంచి అలిపిరిలో టోకెన్లు జారీ చేస్తున్నారు.భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజు సత్రాల్లో భక్తులకు టోకెన్లు ఇస్తున్నారు.
శని, ఆది, సోమవారాల్లో 25 వేల టోకెన్లు, మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో 15 వేల టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.టోకెన్ లేని వారు కూడా కొండపైన సర్వదర్శనానికి వెళ్లవచ్చని చెప్పారు.