నల్లగొండ జిల్లా:మునుగోడులో జరగుతున్న నియోజకవర్గ బీజేపీ బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీజేపీ నేతలు టీఆర్ఎస్,ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాటల తూటాలు పేల్చారు.నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,తెలంగాణ ఇంచార్జి సునీల్ బన్సాల్,హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉప ఎన్నిక ఇంచార్జి వివేక్ వెంకటస్వామి,మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడులో రాజన్నను గెలిపిస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని,తెలంగాణలో అధికారంలోకి రావడానికి ప్రధాన భూమిక నేడు మునుగోడు జరగబోయే ఉప ఎన్నిక కీలకమని అన్నారు.మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి రాజీనామా అనేది ఒక త్యాగమని, ఈ రాజీనామా మునుగుడు ప్రజలకు లాభం మాత్రమే కానీ,రాజగోపాల్ రెడ్డికి కాదని అన్నారు.
మునుగోడులో ఏ ఒక్కరికి సంక్షేమ పధకాల ద్వారా లబ్ది పొందినా అది రాజగోపాల్ రెడ్డి పుణ్యమేనని, మునుగోడు ఎన్నికలలో బీజేపీ ఆయుధం క్రమశిక్షణ, నిజాయితీ అని,టీఆర్ఎస్ కి అధికారం,పోలీసులు, డబ్బులు వంటి ఆయుధాలు ఉన్నాయని,అయినా బీజేపీకి మునుగోడు ఎన్నిక సెమిఫైనల్ అని అన్నారు.మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ స్కాంలు చేసి సొంత ఆస్తులను పెంచుకున్నాడని,హైదరాబాద్ లో 20 వేల ఎకరాలు,కాళేశ్వరం మీద 60 వేల కోట్ల,మిషన్ భగీరథ మీద 30వేల కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు.
కరోనా సమయంలో సొంత డబ్బులతో మునుగోడు ప్రజలకు సహాయం చేసిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అని,దుబ్బాక,జిఎచ్ఎంసి, హుజురాబాద్ లలో కార్యకర్తలు ఎలా కష్టపడ్డారో ఇక్కడ కూడా అలాగే కష్టపడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.తెలంగాణ కోసం ఆనాడు రాజగోపాల్ రెడ్డితో కలిసి పార్లమెంట్ లో కొట్లాడమని,ఈ రోజు కేసీఆర్ అవినీతి పాలపై కొట్లాడుతున్నామని తెలిపారు.
హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి రాజీనామా యాదృచ్చికంగా చెయ్యలేదని,కేసీఆర్ మీద పోరాటం కోసమే చేశారని అన్నారు.ప్రత్యేకంగా రాజగోపాల్ రెడ్డి గెలుపుకోసం పనిచేసే బాధ్యత నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
నేను పెట్టిన కన్నీళ్లు,బాధ రాజగోపాల్ రెడ్డికి రానివ్వనని,బీజేపీ పార్టీ ఎక్కడ ఉందన్న వాళ్లకు ఈ నల్లగొండ ప్రజలు త్వరలో చూపిస్తారని,రేపు ఖమంలో కూడా వస్తదని చెప్పారు.ఏ ఆశయం కోసం తెలంగాణ రాష్టాన్ని సాధించుకున్నామో అదంతా 8 సంవత్సరాల్లో కనుమరుగై పోయిందని,బాగుపడ్డది ఒక్క కేసీఆర్ కుటుంబమే అని ఆరోపించారు.
దుబ్బాకలో లక్ష ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ వస్తదని కేసీఆర్ అన్నాడని, కానీ,గుద్దుడు గుతద్దితే కేసీఆర్ దిమ్మ తిరిగిందని అన్నారు.తెలంగాణ ఉద్యమాన్ని రగిలించడానికి ఆనాడు రాజీనామా చేసి ఉద్యమాన్ని రగిలించినమో, ఈనాడు కేసీఆర్ అహంకారాన్ని బొంద పెట్టడానికి మళ్ళీ రాజీనామా చేసి ఉద్యమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.
సీఎం కేసీఆర్ ని వచ్చే ఎన్నికలలో ఓడగొట్టడమే నా ధ్యేయమని, రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసం పోయేది ఉంటే ఆనాడు కాంగ్రెస్ నుంచి 12 మంది పోయినప్పుడే పొయ్యేవాడినని అన్నారు.మునుగోడులో టీఆర్ఎస్ ది దింపుడు కళ్ళం కాడి ఆశలాగా ఉందని ఎద్దేవా చేశారు.
భారత దేశంలో పార్టీ పెడతనని అనుకుంటున్న కేసీఆర్ యూపీ, బీహార్ కి పోయే సత్తా ఉందా అని ప్రశ్నించారు.మునుగోడు ప్రజల వైపు ఇతర దేశాల్లో ఉన్న భారతీయులు కూడా చూస్తున్నారని అన్నారు.
ఆరునూరైన మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.