హుజురాబాద్ ఫలితమే మునుగొడులో పున్నారావృతం:ఈటెల

నల్లగొండ జిల్లా:మునుగోడులో ప్రజాప్రతినిధులను టిఆర్ఎస్ ప్రభుత్వం బెదిరిస్తుందని,ఎన్ని ఇబ్బందులు పెట్టినా మునుగోడు ఉప ఎన్నికల్లో హుజురాబాద్ ఫలితమే పునరావృతం అవుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.ఆదివారం మునుగోడులో రాష్ట్ర ముఖ్య నేతలతో పాటు 3 వేల మంది బీజేపీ నాయకులతో జరిగే మీటింగ్ కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ బన్సల్ హాజరు కానున్న నేపథ్యంలో శనివారం ఈటెల కార్యక్రమాల పని తీరును పరిశీలించారు.

 Huzurabad Is The Result Of Munigodu: Spears-TeluguStop.com

అనంతరం చౌటుప్పల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం మునుగోడులో జరిగే సమావేశానికి జిల్లా నాయకులు, వివిధ మోర్చాల అధ్యక్షులు,మండల నాయకులు, శక్తి కేంద్ర ఇంచార్జీలు,బూతు కమిటీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు హాజరు అవ్వాలని ఆదేశాలు ఇచ్చారని చెప్పారు.ఈ సమావేశం ద్వారా భవిష్యత్ కార్యాచరణ,ఏ విధంగా ప్రచార కార్యక్రమాలు చేయాలనే అంశాలపై చర్చించనున్నారని తెలిపారు.

మునుగోడు నియోజకవర్గ పరిధిలోని ప్రజా ప్రతినిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం బెదిరింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు.టీఆర్ఎస్ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా,ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా హుజురాబాద్ ఫలితాలే మునుగొడులో పున్నారావృతం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు.

కొంతమంది టీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ బీజేపీకే ముగ్గు చూపుతున్నారని,అందుకే వారిని బెదిరిస్తున్నారని అన్నారు.మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ కు, టీఆర్ఎస్ కు కర్రుకాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు.

రేపు మునుగోడులో జరిగే మీటింగ్ కు ఈటెల రాజేందర్ తో పాటు వివేక్ వెంకట్ స్వామి,గంగిడి మనోహర్ రెడ్డి,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,రాష్ట్ర నాయకులు హాజరుకానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube