సినిమాలు వస్తుంటాయి.పోతుంటాయి.
వారిలో కొన్ని సినిమాలు మాత్రమే ఇండస్ట్రీ హిట్ కొడతాయి.అప్పటి వరకు ఏ సినిమా సాధించని షేర్ కలెక్ట్ చేస్తాయి.
అలా 2011 నుంచి 2020 వరకు పలు సినిమాలు ఇండస్ట్రీ హిట్ సాధించాయి.ఇంతకీ ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అత్తారింటికి దారేది

పవన్ కల్యాణ్ హీరోగా, సమంత హీరోయిన్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది.2013లో వచ్చిన ఈ సినిమా హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించింది.
బాహుబలి

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి 2015లో విడుదల అయిన బాహుబలి సినిమా కూడా కనీవినీ ఎరుగని రీతిలో ఇండస్ట్రీ హిట్ కొట్టింది.ఈ సినిమాకు ముందు.తర్వాత అనేలా వసూళ్లను సాధించింది.
శ్రీమంతుడు

మహేష్ బాబు హీరోగా 2015లో విడుదల అయిన శ్రీమంతుడి సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది.అత్తారింటికి దారేది సినిమా కలెక్షన్స్ ను ఈ సినిమా దాటేసింది.
ఖైదీ నెం.150

2017లో చిరంజీవి హీరోగా వచ్చిన ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టింది.శ్రీమంతుడు సినిమా వసూళ్లను మించి సాధించింది.
బాహుబలి2

2017లో విడుదల అయిన ఈ సినిమా బాహుబలి పార్ట్ 1ను మించి కలెక్షన్స్ సాధించింది.ఇండస్ట్రీ హిట్ కు మారుపేరుగా నిలిచింది.
రంగస్థలం

రామ్ చరణ్, సమంత జంటగా నటించిన ఈ సినిమా 2018లో విడుదల అయ్యింది. ఖైదీ నెం.150 కలెక్షన్లను అదిగమించి ఇండస్ట్రీ హిట్ సాధించింది.
సాహో

2019లో ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా విడుదల అయ్యింది.హైయెస్ట్ వరల్డ్ వైడ్ గ్రేడింగ్ సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ మూవీ.
అలా వైకుంఠపురంలో

2020లో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సాహో కలెక్షన్స్ దాటి ఇండస్ట్రీ హిట్ కొట్ంటింది.