నల్లగొండ జిల్లా:నాంపల్లి మండల పరిధిలోని లక్ష్మణపురం ప్రాజెక్టు(Lakshmanapuram project ) నిర్మాణ పనులను ఆదివారం మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ( Komatireddy Raj Gopal Reddy ) పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి జైల్ సింగ్ ను వివరాలు అడుగగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ప్రాజెక్ట్ ఎన్ఈతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే( Komatireddy Raj Gopal Reddy ) మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ మొత్తం ఏడు ప్యాకేజీల వారిగా నిర్మించాల్సి ఉండగా కేవలం రెండు మాత్రమే 40 శాతం వరకు పనులు చేయడం జరిగిందని,మిగతా వాటిని నిర్మించాలంటే పెండింగ్ బిల్లులు,ఫారెస్ట్ ల్యాండ్, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ తదితర సమస్యలు ఉన్నాయన్నారు.
ఈ సమస్యలు పరిష్కరించి రాబోయే రెండేళ్ళలో ప్రాజెక్టును పూర్తి చేసినట్లయితే ఏదుల నుండి వచ్చే టర్నల్ పూర్తి అయ్యేలోగా మెయిన్ కెనాల్స్,డిస్ట్రిబ్యూటర్ కెనాల్,మైనర్ కెనాల్స్,ఫీల్డ్ కెనాల్స్ కు టెండర్లు పిలిచి కాలువలను పూర్తి చేయాల్సి ఉంటదన్నారు.
కాల్వలను పూర్తి చేయాలంటే ఈ ప్రాజెక్టుకు ఎన్విరాన్మెంట్ అనుమతులు లేవని,ఈ ప్రాజెక్టు మంచినీటి కొరకు మాత్రమే నిర్మిస్తున్నారని, పూర్తిగా వ్యవసాయం సాగునీటికి ఉపయోగపడాలంటే ఎన్విరాన్మెంట్ అనుమతులు తప్పనిసరి అన్నారు.నేను కేంద్రంతో మాట్లాడి ఎన్విరాన్మెంట్ అనుమతులు తెస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నాంపల్లి జెడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వరరెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎరెడ్ల రఘుపతి,సీనియర్ నాయకులు పూల వెంకటయ్య రెడ్డి, ఎంపీటీసీలు,వివిధ గ్రామాల మాజీ సర్పంచులు,ఉపసర్పంచ్లు,ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.