ఉపాధి హామీ పనులపై కలెక్టర్ సమీక్ష

ఆయకట్టు ప్రాంతాలలో కూలీలకు ఉపాధి కల్పించే విధంగా పనులను గుర్తించాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు.శనివారం ఆయన వేములపల్లి, మిర్యాలగూడ మండలాల్లో పర్యటించి, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై సమీక్షించి అభివృద్ధి కార్యక్రమాలను తనిఖీ చేశారు.

 Collector's Review O F ‎mgnrega , ‎mgnrega , Nalgonda , Vinay Krishna R-TeluguStop.com

అనంతరంమిర్యాలగూడ మండల పరిషత్ సమావేశ మందిరంలో ఉపాధి హామీ సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశానికి కలెక్టర్ ఆకస్మికంగా హాజరై గ్రామాల వారిగా జూన్ నుండి ఇప్పటివరకు చేపట్టిన ఉపాధి హామీ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయకట్టు ప్రాంతంలో ప్రస్తుతం ఉపాధి పనులు జరగడం లేదని,కూలీలకు పని కల్పించే విధంగా కొత్త పనులను గుర్తించాలని సూచించారు.

కాల్వ పనులు మినహాయించి గ్రామాలలో మిగిలిన ఏయే పనులు చేయవచ్చో గుర్తించాలన్నారు.

పనులను గుర్తించి వెంటనే కూలీలకు ఉపాధి కల్పించాలని ఆదేశించారు.

వ్యవసాయ సీజన్లో కూలీలకు ఉపాధి కల్పించినట్లయితే,ఇదే పద్ధతిని జిల్లా అంతటా అమలు చేసేందుకు ఉపయోగం ఉంటుందన్నారు.అనంతరం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై జరిగిన అవకతకులపై విలేకరులు ప్రశ్నించగా లబ్ధిదారుల ఎంపిక విషయంలో సమగ్ర విచారణ జరిపామని, అర్హులకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గార్లపాటి జ్యోతిలక్ష్మి గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏపీవోలు శిరీష, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

తొలుత వేములపల్లి మండలంలో ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిడిఓ, ఏపిఓఆర్ ఇతర ఈజియస్ సిబ్బందితో ఉపాధి పనులు గుర్తింపు, లేబర్ టర్నోవర్,వేతనాల చెల్లింపులపై సమీక్షించి ఆదేశాలు,సూచనలు చేశారు.

ముందుగా వేములపల్లి లో నర్సరీ సందర్శించారు.నర్సరీలో కార్యాచరణ ప్రణాళిక ప్రకారం మొక్కల వివరాలు,ఏయే మొక్కలు నాటేందుకు సిద్దం చేస్తున్నారనే తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు.

నర్సరీ పక్కనే వున్న పల్లె ప్రకృతి వనం పరిశీలించి వాకింగ్ ట్రాక్,నీడ నిచ్చే పెద్ద మొక్కలు నాటాలని సూచించారు.తెలంగాణ క్రీడా ప్రాంగణం తనిఖీ చేసి క్రీడా ప్రాంగణం లెవెలింగ్ పూర్తి చేయాలని,15 రోజుల్లో పూర్తిగా వినియోగంలోకి వచ్చేలా సిద్దం చేయాలని సర్పంచ్, అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ దేవిక తదితరులు ఉన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube