ఈ మధ్య కన్నడ సినిమాలకు ఎక్కువ డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే.కేజిఎఫ్( KGF ) సిరీస్ ఆ తర్వాత కాంతారా వంటి బ్లాక్ బస్టర్ కూడా ఆ ఇండస్ట్రీ నుండే రావడంతో అక్కడ సినిమాలలో కంటెంట్ ఉందని ప్రేక్షకులు ఆ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చిన కబ్జ సినిమా మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది.ఈ సినిమాలో ఇద్దరు స్టార్స్ నటించడం వల్ల సినిమా స్టార్టింగ్ అప్పటి నుండి మంచి అంచనాలు నెలకొల్పాయి.
అయితే అనూహ్యంగా రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ఈ సినిమాకు క్రేజ్ తేవడంతో మేకర్స్ విఫలం అయ్యారు.కేజిఎఫ్ సిరీస్ తర్వాత మళ్ళీ అంతటి ట్రీట్ ఇస్తారనేలా మొదట్లో ఆసక్తి రేపింది.
కానీ సరైన ప్రమోషన్స్ లేక సాధారణ రిలీజ్ గానే వచ్చింది.దీంతో కనీసం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేక పోయినట్టు తెలుస్తుంది.
ఈ సినిమా పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కింది.

రిలీజ్ అయ్యాక ఫస్ట్ షో నుండే ఆశించిన టాక్ రాలేదు.అయితే ఈ సినిమా టాక్ మంచిగా రాకపోయిన వరల్డ్ వైడ్ గా మంచి సాలిడ్ వసూళ్లు రాబట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి.కబ్జ (Kabzaa) సినిమా వరల్డ్ వైడ్ గా 26 కోట్లు వసూలు చేసినట్టు పలు పోస్టర్స్ వైరల్ అవుతున్నాయి.
అయితే ఇందులో ఎంత మాత్రం నిజం లేదని తెలుస్తుంది.

ఈ సినిమా కేవలం 10 నుండి 12 కోట్లు మాత్రమే రాబట్టినట్టు టాక్.మరి నెగిటివ్ టాక్ తో స్టార్ట్ అయిన ఈ సినిమా ఫైనల్ రన్ లో ఎలాంటి నంబర్స్ నమోదు చేస్తుందో వేచి చూడాలి.కన్నడ స్టార్ హీరోలు కిచ్చా సుదీప్, రియల్ స్టార్ ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను డైరెక్టర్ చంద్రు( Director Chandru ) తెరకెక్కించాడు.
శ్రేయ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను రవి బసృర్ సంగీతం అందించాడు.అలాగే ఆర్ చంద్రు మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించారు.







