నల్లగొండ జిల్లా:కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను పెంచాలని బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి డిమాండ్ చేశారు.బుధవారం నకిరేకల్ బీఎస్పీ ఆఫీస్ లో తన అద్యక్షతన నిర్వహించిన బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో 340 ఆర్టికల్ ద్వారా మొదటగా బీసీల హక్కుల గురించే వ్రాసారని,ఆ తర్వాతే 341 ఎస్సీ,342 ఎస్టీల గురించి ప్రస్తావించారన్నారు.
న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసింది కూడా బీసీల హక్కుల కోసం, మహిళా బిల్లు కోసమని గుర్తు చేశారు.మండల కమిషన్ సిఫార్సులు కొంతైనా అమలు జరిగాయంటే,27% రిజర్వేషన్ అమల్లోకి వచ్చిందంటే దానికి కారణం కాన్షిరాం దేశవ్యాప్త పోరాటమన్నారు.42 రోజుల పాటు పార్టీ శ్రేణులతో బోట్స్ క్లబ్-ఢిల్లీలో దీక్ష చేశారన్నారు.కానీ, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లు 50 శాతం మించడానికి వీల్లేదని ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును కాదని 3% శాతం కూడా పేదలు లేని ఓసీలకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చారని, దాన్ని సుప్రీంకోర్టు జడ్జీలు సమర్ధించారన్నారు.
జ్యుడిషియల్ లో బీసీ,ఎస్సీ,ఎస్టీలు లేకపోవడం వల్లనే వాళ్ళు ఇచ్చిన తీర్పులు ఓసీలకు అనుగుణంగా ఉన్నాయన్నారు.వారికి ఇచ్చిన రిజర్వేషన్లు పూర్తిగా బీసీల అవకాశాలను దెబ్బకొట్టడమేనని తెలిపారు.ఐదు లక్షల ఆదాయం ఉన్న ఓబీసీలు క్రిమిలేయర్ పరిధిలోకి రావడం,8లక్షల ఆదాయం ఉన్నప్పటికీ ఓసీలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందడం దుర్మార్గమన్నారు.దాని గురించి బీఎస్పి పోరాటం చేయాలని సంకల్పించిందని,బీసీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కూడా 52% శాతానికి పెంచాలని,కేసీఆర్ ఎలాగైతే ఎస్టీలకు 10% పెంచారో అలాగే బీసీలకు కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు శాతం ఒకసారి పరిశీలిస్తే బీసీ, ఎస్సీ,ఎస్టీల దీనస్థితి ఏంటో అర్థమవుతుందన్నారు.సెంట్రల్ యూనివర్సిటీలు,ఐఐటీలు,ఐఐఎంలు, ఇంకా చాలా ప్రభుత్వ రంగ సంస్థల్లో మన వాటానే పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పుడే ఇలా ఉంటే వీటిని ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ లో రిజర్వేషన్లు ఇవ్వగలదా? అని ప్రశ్నించారు.అంటే మన హక్కులు ఒక్కొక్కటిగా కోల్పోతున్నామని,బీసీ ప్రధాని కనీసం బీసీ జనగణన చేయలేకపోతున్నారని, కేసీఆర్ ఏమో స్థానిక సంస్థలల్లో బీసీల వాటా తగ్గిస్తుండని,ఎస్సీ,ఎస్టీలకు బీసీలకు గొడవలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నరని,పాలకులు చేసే ఈ మోసాలను పసిగట్టిన కాన్షిరాం బీసీల కోసం బీఎస్పి స్థాపించి ఓట్లు మావే- సీట్లు కూడా మావే అని నిరుపేద బీసీలకు ఎమ్మెల్యేలుగా,మంత్రులుగా అవకాశం ఇచ్చాడన్నారు.
బీసీలు ఇప్పటికైనా ఆలోచన చేయాలని,అన్ని రంగాల్లో మన వాటా మనకు కావాలనే బీసీలు బీఎఎస్పీ లోకి రావాలని పిలుపనిచ్చారు.మన కోసం ఆర్ఎస్పీ తన ఉన్నతమై ఉద్యోగాన్ని సైతం వదిలేసి మహాత్మ జ్యోతీ రావ్ పూలే, అంబేడ్కర్,కాన్షిరాం బాటలోకి వచ్చాడని,నేడు ఆర్ఎస్పీ వెంట మనమంతా నిలబడి,ఏనుగు గుర్తుకు ఓటేసి అసెంబ్లీలోకి 70 మంది బీసీలు అడుగుపెట్టాలని,అప్పుడే మన వాటా మనం సాధించుకోగలమని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఇంచార్జి కట్ల జగన్నాథంగౌడ్,ప్రొ.తులసి సంపత్ కుమార్,జిల్లా కోశాధికారి కొవ్వూరి రంజీత్,నియోజకవర్గ అద్యక్షులు గద్దపాటి రమేష్,నియోజకవర్గ ఉపాధ్యక్షులు పావిరాల నర్సింహ యాదవ్,బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గొడుగు లక్ష్మీనారాయణ,స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పల్లగొర్ల మోదీ రాందేవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజు,బిసి విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గజ్జి నరేష్, బిఎస్పీ నియోజకవర్గ మహిళ కన్వీనర్ మర్రి శోభ,రామన్నపేట మండల అధ్యక్షులు మేడి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.