నల్లగొండ జిల్లా:మునుగోడు మండల కేంద్రంలో గల ప్రైవేట్ స్కూల్స్ లో పీజులు అడ్డగోలుగా వసూల్ చేస్తున్నారని విద్యార్థుల తల్లితండ్రులు వాపోతోన్నారు.విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం రెండు సంవత్సరాల నుండి కరోనా వల్ల ఆన్లైన్ క్లాస్ లని ఫీజులు వసూల్ చేశారని,రెండు సంవత్సరాలలో పిల్లలు ఉన్న చదువుని కూడా మర్చిపోయారని,ఈ సంవత్సరం అయినా మంచిగా చదువుకోవాలని పిల్లల్ని స్కూల్ లో ఎగువ క్లాస్ జాయిన్ కోసం వెళ్తే వేలల్లో ఫీజులు అడుగుతున్నారని,ఇష్టం ఉంటే జాయిన్ చేయండి లేదంటే లేదని ఆయా స్కూల్స్ యాజమాన్యాలు వ్యవహరించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సేయింట్ జోసఫ్ హై స్కూల్ నర్సరి పిల్లవాడికి సెంట్రల్ సెలబస్ పేరుతో 25,000 ఫీజు వసూల్ చేస్తున్నారంటే ఏ రేంజ్ లో దందా ఉందో అర్ధం చేసుకోవచ్చు.మరొక కైరలి పబ్లిక్ స్కూల్ లో 4 వ,తరగతి పిల్లాడికి 20,000 పైన ఫీజులు వసూలు చేస్తూ మళ్ళీ స్కూల్ డ్రెస్ లు, బుక్స్ పేరుతో బోనస్ గా దండుకుంటున్నారని వాపోతున్నారు.
అటు ప్రభుత్వ పాఠశాలలో అసౌకర్యాల వల్ల అందులో చేర్పించలేక,ఇటు ప్రైవేట్ లో ఫీజుల బాదుడుకి తట్టుకోలేక పోతున్నామని వాపోతున్నారు.కాబట్టి విద్యాశాఖ ఉన్నత్తాధికారులు ఈ సమస్యపై స్పందించి ప్రైవేట్ స్కూళ్ల దోపిడిని అరికట్టాలని వేడుకుంటున్నారు.