యాదాద్రి జిల్లా:బీబీనగర్ మండల కేంద్రంలోని ఎయిమ్స్ 2021-2022 ఎంబీబీఎస్ బ్యాచ్ విద్యార్థులకు నిర్వహించనున్న వైట్ కోర్ట్ సెరమోనీ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ ముఖ్యాతిధిగా హాజరయ్యారు.ఆమెకు ఎయిమ్స్ అధికారులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా వైద్య విద్యార్థులనుద్దేశించి గవర్నర్ తమిళసై మాట్లాడుతూ ముందుగా ఎంబిబిఎస్ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందుబాటులోకి రావాలని,తన భర్త నెఫ్రాలజిస్ట్,తను గైనకాలజిస్ట్ నని,అల్ట్రా సౌండ్ లో మంచి అనుభవం ఉందన్నారు.
ఐరన్ మాత్రలు వేసుకుంటే మంచిదని, కానీ,పుట్టే పిల్లలు నల్లగా అవుతారని ఐరన్ మాత్రలు గర్భిణులు పడేస్తున్నారని,ఐరన్ మాత్రలు గర్భిణులు వేసుకుంటే పుట్టే పిల్లలు బలంగా పుడతారని తెలిపారు.ఇలాంటి వాళ్ళకు అవగాహన పరచాలని, ఫెటల్ థెరపీ నేర్చుకోవడం కోసం తాను కెనడా వెళ్ళానని,డిజబుల్ పిల్లలకు ఇది ఉపయోగపడుతుందన్నారు.
మీరు నేర్చుకునేది సిన్సియర్ గా నేర్చుకోండి.ముఖ్యంగా రోగ లక్షణాల గురించి ఎక్కువ నేర్చుకోండి.
వైద్య వృత్తిని ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవాలని సూచించారు.ఎయిమ్స్ సిబ్బందిని అభినందిస్తున్నానని,విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులకు ఆఫ్ లైన్ క్లాస్ లు నిర్వహించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మెడికల్ ఎడ్యుకేషన్ కి కేంద్రం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందన్నారు.ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం అమలులో ఉందని, పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ ప్రోగ్రాం అమల్లోకి వస్తుందన్నారు.
పాండిచ్చేరి కి కూడా నేనే గవర్నర్ గా పని చేస్తుస్తున్నాను.అత్యంత తక్కువ వయసులో గవర్నర్ ని అయ్యానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.