నల్లగొండ జిల్లా:నాగార్జునసాగర్ కు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు,కౌన్సిలర్ రమేష్.జి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ కారుల సంక్షేమ బోర్డుకు ఏర్పాటు చేసి,10 వేల కోట్లు కేటాయించాలని కోరారు.ప్రతి ఉద్యమకారుడుకి 300 గజాల ఇంటి స్థలం కేటాయించాలని,అలాగే ప్రతి ఉద్యమకారుడు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని,నామినేటెడ్ పోస్టులలో ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరారు.
జార్ఖండ్ రాష్ట్రం తరహాలో ఉద్యమకారులకు ప్రతి నెలా పెన్షన్ ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి పోస్టు కార్డు ద్వారా విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు సిరికొండ మధు,కంచర్ల సుధీర్ కుమార్,షేక్ చాంద్ పాష, యమ్.వెంకోజి,శివ నాగులు,సత్యనారాయణ (ఉక్కు)నాగార్జున తదితరులు పాల్గొన్నారు