గుడిపల్లి మండలం మాకొద్దని రాస్తారోకో

నల్లగొండ జిల్లా: పెద్ద అడిశర్లపల్లి మండలం చిలకమర్రి గ్రామాన్ని గుడిపల్లి మండలంలో కలపవద్దని గ్రామపంచాయతీ సర్పంచ్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి,శనివారం కోదాడ జడ్చర్ల జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ విజయలక్ష్మి మాట్లడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన గుడిపల్లి గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేసి 11 గ్రామాలతో కలిపి ప్రాథమిక గెజిట్ విడుదల చేస్తూ అభ్యంతరాలను 15 రోజులలో కలెక్టర్ కి తెలపాలని కోరిందని అన్నారు.

 Chilakamarri Village People Protest Against Gudipalli Mandal, Chilakamarri Villa-TeluguStop.com

అందులో భాగంగానే గత రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ కు తమ గ్రామాన్ని పాత మండలంలోనే ఉంచాలని వినతిపత్రం అందజేశామని తెలిపారు.గ్రామం నుండి పెద్ద అడిశర్లపల్లి మండల కేంద్రానికి రోడ్డు సదుపాయం ఉందని, గుడిపల్లికి రోడ్డు సౌకర్యం లేదని అందుకే తమ గ్రామాన్ని అందులో కలపవద్దని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube