ఎస్ సేవ అధ్వర్యంలో విద్యార్దులకు,తల్లిదండ్రులకు హెల్మెట్లు పంపిణీ

నల్లగొండ జిల్లా: ఎస్ సేవ వ్యవస్థాపకులు ఎంఏ బేగ్ అధ్వర్యంలో సోమవారం నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థిని, విద్యార్దులకు,బైక్ ఉండి లైసెన్స్ కల్గిన వారి తల్లిదండ్రులకు ఉచిత హెల్మెట్‌లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎస్ సేవ వ్యవస్థాపకులు ఎంఏ బేగ్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై తల్లిదండ్రులలో పాటు పాఠశాలకు వెళ్ళే విద్యార్దులు కూడా ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ హెల్మెట్ తప్పనిసరి ధరించాల్సిన అవసరం ఉందన్నారు.

 Distribution Of Helmets To Students And Parents Under The Auspices Of Sseva Foun-TeluguStop.com

ప్రమాదాలు జరిగినప్పుడు తలకు తగిలే తీవ్రమైన గాయాల నుండి తమను తాము రక్షించుకోవడానికి హెల్మెట్‌ ఉపయోగపడుతుందని వివరించారు.పిల్లలు మరియు తల్లిదండ్రులకు రైడింగ్ సమయంలో లేదా పిలియన్ రైడర్‌లకు తోడుగా ఉండే హెడ్ సేఫ్టీ గేర్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమానాయక్,ఏఎస్ఐ సత్తు రామయ్య,స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం ఆర్.రవి నాయక్,ఉపాధ్యాయులు డి.సత్యనారాయణ,వెంకట్రాం తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube