గుర్రంపోడ్ తహశీల్దార్ కార్యాలయంలో అక్రమార్కులకు పట్టాలు...!

నల్లగొండ జిల్లా:గుర్రంపోడు మండలం తహశీల్దార్ కార్యాలయం పేరు వింటేనే రైతుల గుండెళ్ళో రైళ్లు పరుగెడుతున్నాయి.కొప్పోల్ రెవిన్యూ శివారులోని 102 సర్వే నెంబర్లో భూమి కలిగి, కబ్జాలో ఉండి,సాగు చేస్తున్న రైతులకు ఏళ్ల తరబడి తిరిగినా నూతన పట్టాదార్ పాస్ పుస్తకాలు రాకపోగా,ఎలాంటి భూమి లేని పైరవీకారులు మాత్రం దర్జాగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొంది ఎంచక్కా రైతు బంధు డబ్బులు తీసుకుంటున్నారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు.

 In Gurrampod Tehsildar's Office, The Illegals Are Caught , Gurrampod Tehsildar,-TeluguStop.com

తమ భూమిపై వేరే వారికి పట్టాలు ఇచ్చారని ఎన్నో మార్లు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకున్నా వాటిని తిరస్కరిస్తూ వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ తహశీల్దార్ కార్యాలయంలో పైరవీకారులకే తప్ప నిజమైన రైతులకు పని జరగట్లేదని, ఇదేవిషయమై ప్రస్తుత కలెక్టర్ నారాయణ రెడ్డి గతంలో జిల్లాలో జేసీగా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఫిర్యాదు చేయగా 102 సర్వే నంబర్ ను రీసర్వే చేపట్టి అసలు రైతులను గుర్తించి, పట్టాదార్ పాస్ పుస్తకాల మంజూరు చేయాలని నాటి తహశీల్దార్ సైదులును ఆదేశించారని,కానీ,నేటి వరకు జేసి ఆదేశాలు అమలుకు నోచుకోలేదని వాపోతున్నారు.

ఇప్పుడు జిల్లా కలెక్టర్ గా వచ్చిన సి.నారాయణరెడ్డి తమ సమస్యపై చొరవ చూపి పరిష్కారం చేయాలని మండల రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.ఇదిలా ఉంటే గుర్రంపోడు మండల డిప్యూటీ తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ ఫరీదుద్దీన్ కోర్టు పరిధిలో ఉన్న వ్యవసాయ భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయడంతో బాధిత మహిళా రైతు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని సంప్రదించగా,వెంటనే విచారణకు ఆదేశించాడు.విచారణలో బాధిత మహిళ చేసిన ఆరోపణ నిజమైన తేలడంతో డిప్యూటీ తహశీల్దార్ ని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube