సాగర్ లో మహిళలే మహారాణులు...!

నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ నియోజకవర్గం( Nagarjuna Sagar Assembly constituency )లోని ఏడు మండలాల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండడంతో అన్ని పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థుల చూపు ఆ వైపుకు మళ్లి,వారిని ప్రసన్నం చేసుకొనే పనిలో ఉన్నారు.నోముల భగత్ (బీఆర్ఎస్),కుందూరు జైవీర్ రెడ్డి(కాంగ్రెస్), కంకణాల నివేదిత రెడ్డి (బీజేపీ) పోటీ పడుతున్నారు.

 Women Are Queens In Sagar Nagarjuna Sagar Constituency , Nalgonda District , T-TeluguStop.com

కానీ, బీఆర్ఎస్,కాంగ్రెస్ మధ్యే హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉందని,బీజేపీ( BJP ) అభ్యర్ధి మహిళ అయినా ఆ పార్టీకి సాగర్ లో అంతగా లీడర్,క్యాడర్ లేకపోవడంతో పెద్దగా కలిసొచ్చే అవకాశం లేదనే వాదన వినిపిస్తోంది.సాగర్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,33,412 కాగా అందులో 1,14,7524 మంది పురుషులు, 1,18,640 మంది మహిళలు ఉన్నారు.

మండలాల వారీగా చూసినా అదే పరిస్థితి కనిపిస్తోంది.నిడమనూరు మొత్తం ఓట్లు 35,636 పురుషులు-17,362, స్త్రీలు-18,272, త్రిపురావరం మొత్తం ఓట్లు 35,957,పురుషులు -17,690, స్త్రీలు-18,263, అనుముల మొత్తం ఓట్లు 35,965,పురుషులు-17,592, స్త్రీలు-17,092, తిరుమలగిరి(సాగర్)( Thirumalagiri (Sagar) ) మొత్తం ఓట్లు 34,075, పురుషులు- 16,981, స్త్రీలు-17,092,పెద్దవూర మొత్తం ఓట్లు 46,354, పురుషులు-22,676, స్త్రీలు -23,671, గుర్రంపోడు మొత్తం ఓట్లు 37,794,పురుషులు- 18,690,స్త్రీలు-19,102, మాడ్గులపల్లి మొత్తం ఓట్లు 7,631,పురుషులు-3,761, స్త్రీలు-3,870.

మహిళా ఓటర్లు అత్యధికంగా పెద్దవూరలో అత్యల్పంగా మాడ్గులపల్లిలో ఉన్నారు.అందుకే అందరూ ఆ వైపుకు దృష్టి మళ్లించారని తెలుస్తుంది.సాగరతీరంలో మహిళామణులు ఎవరికీ జై కొడతారో ఎవరికీ నై కొడతారో తెలియాలంటే డిసెంబర్ 3 వరకు వెయిట్ అండ్ సీ…!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube