నల్గొండ జిల్లా:రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మంగళవారం నల్లగొండలో సుడిగాలి పర్యటన చేశారు.పట్టణాభివృద్ధిలో భాగంగా చేపట్టిన పలు పనులను పరిశీలించారు.
అనంతరం వల్లభరావు చెరువు,పానగల్ ఉదయ సముద్రం మినీ ట్యాంక్ బండ్ లపై చేపట్టే అభివృద్ధి పనులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి,జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి,వైస్ చైర్మన్ రమేష్,మున్సిపల్ కమిషనర్ కెవి.
రమణాచారి, కౌన్సిలర్ పూజిత శ్రీనివాస్,ఎస్పీడిసిఎల్ డీఈ విద్యాసాగర్,మున్సిపల్ సిబ్బంది తదితరులు, పాల్గొన్నారు.