మత్తు వదిలించలేరా?-తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బోరన్న బహిరంగ లేఖ

నల్లగొండ జిల్లా:గంజాయి విష వలయం నుండి విద్యార్థి యువతను కాపాడాలి.పెచ్చరిల్లుతున్న పెడధోరణులను అంతమొందించాలి.

 Can't Get Rid Of Intoxication?-boranna's Open Letter To The Chief Minist-TeluguStop.com

మాదకద్రవ్యాలను నిషేధించాలి.తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులకు బోరన్న బహిరంగ లేఖ.తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాలలో పల్లె పట్నం తేడా లేకుండా ముక్కుపచ్చలారని చిన్నారులను మాదకద్రవ్యాల మహమ్మారి కాటేస్తుంటే పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కమ్యూనిస్టు పార్టీ సిపిఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి, సామాజిక కార్యకర్త సుభాషన్న ఆరోపించారు.హైదరాబాద్,విజయవాడ,కోదాడ,రాజమండ్రి పరిసర ప్రాంతాలలో కొన్ని పాఠశాలల విద్యార్థులు మత్తు మందులు వినియోగిస్తున్నట్లు వస్తున్న వార్తలను చూసి బోరన్న బాధ పడుతూ విద్యార్థి వనంలో పడగ విప్పుతున్న గంజాయిపై ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లకు బహిరంగ లేఖ రాశారు.

మాదకద్రవ్యాలను ఉచితంగా రుచి చూపిస్తూ చిన్నారులను నెమ్మదిగా మత్తు రొంపిలోకి దించి,పసి పిల్లలను క్రమేణా వాటికి బానిసలను చేసి,అక్రమ సరఫరాదారులుగా, నేరగాళ్లుగా మారడానికి కారకులవుతున్నారని ప్రజా ఉద్యమకారుడు సుభాష్ చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు.గంజాయి బారిన పడుతున్న బాలల భవిష్యత్తుపై బోరన్న తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ గల్లీ నుండి ఢిల్లీ దాకా లక్షలాదిమంది చిన్నారులను మాదకద్రవ్యాల మాయా వలలోకి నెట్టివేసి,రేపటి భవిష్యత్తు భారత అభివృద్ధిపై గొడ్డలి కాటు వేస్తున్నారని బోసన్న కన్నీరు పెట్టారు.

ఏడవ తరగతి నుండి డిగ్రీ,ఇంజనీరింగ్, మెడిసిన్ కాలేజీల దాకా గుట్టుచప్పుడు కాకుండా ఈ చీకటి దందా కొనసాగుతుందని తెలిపారు.ఇప్పటికే దేశవ్యాప్తంగా లక్షలాది మంది తెలుగు రాష్ట్రాల్లో వేలాదిమంది గంజాయి,నల్లమందు,మద్యం,పొగాకులకు అలవాటు పడ్డారని,గంజాయితో పాటు రంగుల్లో కలిపే రసాయనాలు,జిగుర్ల వంటి వాటిని సేవిస్తూ ఎందరో గ్రామీణ బాలలు తమ ఆరోగ్యాలను గుల్ల చేసుకుంటున్నారని పేర్కొన్నారు.

తెలిసీ తెలియని వయస్సు,దుష్పరిణామాలను ఊహించలేని మనస్సు వెరసి నిషా గుప్పిట్లో పసిడి రెక్కల బాల్యం ఛిద్రమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.బడి పిల్లలే లక్ష్యంగా ప్రాంతాలకు అతీతంగా జడలు విరబోసుకుంటున్న విష వ్యాపారం తల్లిదండ్రుల కలలనే కాదు,మన దేశ భవిష్యత్తునే కాల రాస్తోందని తెలిపారు.

విషవలయంలో చిన్నారులు నెట్టివేయబడటానికి ప్రధానంగా బాధ్యత వహించవలసింది కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలేనని ప్రధానమంత్రి మోడీ నుండి జగన్మోహన్రెడ్డి,కేసీఆర్ ల దాకా మాదకసురుల ఆటలు కట్టించడంలో ఘోరంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు.కోదాడలో పదిహేనేళ్ల బాలుడు గంజాయ్ కి బానిసై ఎంతకు మారకపోవడంతో బుద్ధి చెప్పాలని భావించిన కన్నతల్లి అతన్ని స్తంభానికి కట్టేసి మొహానికి కారం పులిమిందంటే పరిస్థితులు ఏ స్థాయికి నెట్టబడ్డాయో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుసుకోవాలని సూచించారు.

దేశవ్యాప్తంగా ఆల్కహాల్ తరువాత ఎక్కువమంది గంజాయి వ్యసనపరులుగా మారుతున్నారని,సరదాగా అలవాటు చేసుకుంటున్న ప్రతి 10 మందిలో ఇద్దరూ దానికి పూర్తిగా బానిసలై పోతున్నట్లు భారత గ్రామీణ చైతన్య వేదిక చేసిన సర్వేలో తేలిన విషయాన్ని గుర్తు చేశారు.గంజాయి మత్తుకు అలవాటు పడ్డవారు మరి కొంతమందిని మత్తులోకి దించుతున్నారని,ఇటువంటి చెడు స్నేహాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని పిల్లలకు పెద్దలు చెప్పాలని పేర్కొన్నారు.గంజాయి రవాణా కేసులో చిక్కి విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలుగా ఉన్న వారిలో 90% మంది పేద మధ్యతరగతి వర్గాల వారేనని మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు న్యాయవాది గొలుసుల మోహన్ సెల్ నెంబర్.9440102129 నల్గొండ కోర్టులో తనకు చెప్పిన విషయాలను గుర్తు చేశారు.విజయవాడలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు కళాశాల ఫీజుల కోసం తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులను వినియోగించారని,డబ్బులన్నీ అయిపోయాక అడ్డదారులు తొక్కడం,చివరకు కేసుల పాలు కావడాన్ని తెలుసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సూచించారు.తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ గంజాయి పట్టుబడ్డ దాని మూలాలు విశాఖ మన్యంలోనే ఉంటున్నాయని,విశాఖ మన్యంలో 20 వేల ఎకరాల్లో గంజాయి తోటలు సాగవుతుంటే ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు.

ఆంధ్రకాశ్మీర్ గా పేరొందిన లంబసింగి నేడు గంజాయి మాఫియా కేంద్రంగా మారిందని,విశాఖ మన్యం నుండి దేశ వ్యాప్తంగా రవాణా చేయడానికి,యువతను గంజాయి మాఫియా పావులుగా వాడుకుంటున్న విషయాలపై దృష్టి పెట్టాలని జగన్ మోహన్ రెడ్డిని కోరారు.లంబసింగికి దేశవ్యాప్తంగా అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారని,వారిలో కొందరు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారని,పోలీసులు సరైన తనిఖీలు చేయడం లేదని సీఎం జగన్ కి ప్రజారత్న అవార్డు గ్రహీత,సమాజ హితాన్ని కాంక్షించే అభ్యుదయవాది కామ్రేడ్ బోర సుభాష్ చంద్రబోస్ ఆంధ్ర రాష్ట్ర పోలీసుల నిర్లక్ష్యం మీద ఫిర్యాదు చేశారు.

గంజాయి రవాణాకు స్మగ్లర్లు విలాసవంతమైన కార్లను వినియోగిస్తున్నారని,పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే పాత్రధారులే జైలు పాలవుతున్నారని, కానీ,సూత్రధారులు తమ చేతికి మట్టి అంటకుండా తప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కొండ కోనల్లో సాగుతున్న గంజాయి సాగును డ్రోన్ల సాయంతో గుర్తించి దాన్ని నివారించే చర్యలు తీవ్రతరం చేయాలని,కఠిన చర్యలు చేపట్టాలని కేసీఆర్,జగన్ మోహన్ రెడ్డిని కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి బోరన్న కోరారు.

గంజాయి సాగు రవాణా నిర్మూలనకు అహర్నిశలు కృషి చేస్తున్నామని పోలీసులు చెబుతున్న మాటలు వాస్తవం కాదని,కొన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బంది,మరికొందరు అధికారుల సహకారంతోనే గంజాయి సరఫరా కావలసిన చోటుకు చేరుతున్నట్లు ప్రజా ఉద్యమకారుడు బోర సుభాషన్న ముఖ్యమంత్రులకు వివరించారు.గంజాయి మాఫియాకు సహకరిస్తున్న అధికారులకు పోలీసులకు ఖరీదైన బహుమతులు అందుతున్నాయని ఆరోపించారు.

గంజాయి సరుకుని పట్టుకున్న పోలీస్ స్టేషన్లలో నిలవ ఉంచినప్పుడు దానిని సైతం కొద్దికొద్దిగా అమ్మేసుకుంటున్న ఖాకీల బాగోతాన్ని,దీనివల్ల కొందరు పోలీసు అధికారులు సైతం జైలు పాలు అయిన విషయాలను ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకొచ్చారు.విద్యార్థి,యువకులే పావులుగా బరితెగించిన గంజాయి మాఫియా ప్రపంచాన్ని తలక్రిందులు చేసిన కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా వందల,వేల, కోట్లలో వ్యాపారం సాగిందని సామాజిక ఉద్యమ నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.

కొన్ని చోట్ల చిన్న చిన్న ప్యాకెట్లు రూపంలో పాన్ షాపులలో లభ్యమవుతుందని తెలిపారు.గంజాయి,గుట్కా దందా గుట్టుచప్పుడు కాకుండా కొత్త కొత్త దారులలో కొనసాగుతుందని పేర్కొన్నారు.గంజాయి మత్తు విద్యార్థుల జీవితాలను చిత్తు చేస్తుంటే ముఖ్యమంత్రులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు.పోలీసుల కళ్లుగప్పి తప్పించుకునేందుకు ఆయుర్వేద మందుల రూపంలో కూడా లిక్విడ్ గంజాయితో మాఫియాదారులకు లాభాల పంట పండుతుందని, ఎన్ని కోణాల్లో నిఘా పెట్టినా రకరకాలుగా రూటు మారుస్తున్న గంజాయి మాఫియా సోషల్ మీడియాను సైతం వ్యాపార కేంద్రంగా మార్చుకుని ఆన్లైన్లో బిజినెస్ కొనసాగిస్తున్నారని,స్మార్ట్ఫోన్లు వారి ఆయుధంగా మారాయని బోర సుభాషన్న ఆవేదన వ్యక్తం చేశారు.

గంజాయి సాగును అరికట్టేందుకు రైతులకు, గిరిజనులకు ప్రత్యామ్నాయ పంటలు,ఉపాధి మార్గాలు చూపాలని కోరారు.గంజాయి సాగు విషయంలో ఆ మాఫియా కొన్ని చోట్ల గంజాయి తోటలకు డ్రిప్, ఇరిగేషన్ తరహాలో నీటి వసతి కల్పించారని, గంజాయికి అవసరమైన ఎరువులను సరఫరా చేయడమే కాకుండా,సాగుకు పెట్టుబడి వ్యయం ఇస్తోందని,సరుకును నేరుగా కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు.

ఇతర పంటలను సాగు చేస్తున్న గిరిజనులకు పాలకుల ఆదరణ కరువైందని,పంటలను మైదాన ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయించలేక దళారులు చెప్పిన ధరకు తెగనమ్ముకుంటున్నారని,శ్రీకాళహస్తి కేంద్రంగా జర్నలిస్టుగా పనిచేస్తున్న విప్లవ కార్మిక నాయకుడు అమరజీవి ఇమామ్ అహ్మద్ కూతురు యాసీన్ ఫోన్ నెంబర్ 9849817897 చెప్పిన బాధాకర మాటలను బోర ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి గుర్తు చేస్తూ ఈ దుస్థితిలో మార్పు రానంత వరకు గంజాయి సాగు కొనసాగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.మాదక రక్కసి కబంధహాస్త్రంలోంచి నవతరాన్ని కాపాడుకునేందుకు సరైన ప్రణాళిక రూపొందించాలని,విద్యాలయాల చుట్టుపక్కల నేరగాళ్ల కదలికలను పూర్తిగా కట్టడి చేయడం,పిల్లల నడతను గమనించడం,విద్యార్థులను నిరంతరం చైతన్యం చేయడం ద్వారా మార్పు సాధ్యమవుతుందని సూర్యాపేట జిల్లా టిడిపి నేత బయ్యా నారాయణ యాదవ్ సెల్ నెంబర్ 9951328336 చెప్పిన విషయాలను బోర గుర్తు చేశారు.

గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించకుండా,ఆ మత్తుకు ప్రజలు బానిసలు కావడాన్ని అడ్డుకోవడం అసాధ్యమని,ఈ విషయలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఉపేక్ష భావితరాలకు శాపంగా మారుతోందని తెలిపారు.ప్రతి పాఠశాల ఆవరణలో సిసిటివి కెమెరాలు ఏర్పాటు, తల్లిదండ్రుల సమన్వయ కమిటీల ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ నిరంతరం జరగాలని సూచించారు.

నేర శక్తులపై ఉక్కుపాదం మోపాలని,నవతరంలో నైతిక విలువలు పాదుకొలుపాలని,గంజాయిని సమాజం నుంచి తరిమి వేయడంలో పాలకులు,అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని సి.పి.ఐ.(ఎం-ఎల్)నేత బోర సుభాష్ చంద్ర బోస్ కోరారు.తెలుగు రాష్ట్రాల్లో గుప్పుమంటోన్న గంజాయి దందాలపై కఠిన చర్యలు చేపట్టుటకు,పాలకులపై ఒత్తిడి పెంచేందుకు ప్రజలు, ప్రజా సంఘాలు ఉద్యమించాలని బోరన్న పిలుపునిచ్చారు.మద్యపాన అలవాటు వల్ల ఒక నాడు కొంత ఆర్థికంగా సామాజికంగా నష్టపోయిన సూర్యాపేట జిల్లా -ఏపూర్ కు చెందిన అమరజీవి రావుల వెంకటయ్య పెద్ద కొడుకు,న్యూ డెమోక్రసీ నేత దివంగత జన్నుబాయి మేనల్లుడు,తెలంగాణ జన సమితి కోదండరామ్ తర్వాత రెండో స్థానంలో ఉన్న టీజేఎస్ దళపతి ధర్మార్జున్ బంధువు రావుల సంజీవ గౌడ్ సెల్ నెంబర్:9704746365 ని తన భార్య సుకన్య మంచితనంతో పాటు తన తప్పులు సరిదిద్దుకొని,మద్యపానానికి పూర్తిగా దూరమై నేడు సమాజంలో మంచి పౌరుడిగా జీవిస్తున్నాడని ఏపూరు గ్రామ ఆదర్శ రైతు మట్టపల్లి గంగన్న యాదవ్ ఫోన్ నెంబర్.9948066594 అభినందించిన విషయాలను బోరా సుభాషన్న గుర్తు చేశారు.ఒకనాడు త్రాగి చనిపోతాడని ఎగతాళి చేసిన వారే,సంజీవలో వచ్చిన మార్పుని,క్రమశిక్షణగా పనిచేస్తూ 20 లక్షలు ఖర్చు పెట్టి నిర్మించిన ఇల్లు,సూర్యాపేటలో కొన్న ఇంటి స్థలంను,పిల్లలను హైదరాబాదులో ప్రైవేట్ స్కూల్లో చదివించే పరివర్తనను,చూసి శభాష్ సంజీవ అని మెచ్చుకుంటున్నారని సుభాషన్న పేర్కొన్నారు.

నాటి సంజీవ్ లాగా తెలుగు రాష్ట్రాల్లో దారి తప్పిన వారిని బాగు చేయాల్సిన బాధ్యత మత్తు,మాదకద్రవ్యాల ఆకర్షణల నుండి మనుషుల జీవితాలు చిత్తు కాకుండా కాపాడే కర్తవ్యం జగన్,కేసీఆర్ లదేనని సుభాషన్న పేర్కొన్నారు.మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు యువతరం బలికాకుండా మార్పును తెచ్చేందుకు విద్యార్థులలో సామాజిక స్పృహ నైతిక విలువలు దేశభక్తి భావాలు పెంపొందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వ్యాసరచన పోటీలు సభలు సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

మాదక ద్రవ్యాల నియంత్రణ సామాజిక బాధ్యత అనే అంశంపై మంచి పుస్తకాన్ని తెస్తామని, మంచి రచనలు చేసిన,పాటలు రాసిన వారికి ప్రోత్సాహకంగా ప్రథమ బహుమతి లక్ష రూపాయలు, రెండవ రచనకు 75000,మూడవ వారికి 50 వేలు, 4వ వారికి 25000 బహుమతి అందజేస్తామని సుభాషన్న తెలిపారు.మాదకద్రవ్యాల వ్యసనాలతో యువతకు వాటిల్లే ముప్పు,జగతికి జరిగే ప్రమాదాల గురించి అన్ని రకాల మత్తుపదార్థాల సంపూర్ణ నిషేదాన్ని బలపరుస్తూ ఉద్యమాలకు బాసటగా నిలిచే విధంగా కేంద్ర,రాష్ట్ర పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించే ప్రజల అభివృద్ధిని కాంక్షించే అభ్యుదయవాదులు,విద్యార్థులు,రచయితలు,కవులు, కళాకారులు తమ రచనలను,పాటలను,కవితలను 9848540078 సెల్ నెంబర్ కి పంపాలని లేదా బి వి ఆర్ మహాత్మా గాంధీజీ 2-2-231,ఎస్.

ఈ.రెసిడెన్సీ 202 బాగ్ అంబర్ పేట, హైదరాబాద్ – 500013 కి పోస్ట్ ద్వారా,కొరియర్ ద్వారా పంపాలని ప్రజాస్వామిక పోరాటాల నేతాజీ,ప్రజారత్న అవార్డు గ్రహీత కామ్రేడ్ బోర సుభాషన్న పేర్కొన్నారు.కార్టూనిస్టులు కూడా మంచి బొమ్మలు వేసి పంపవచ్చునని బోరన్న తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube