వాటర్ ట్యాంక్ లో శవం కలకలం.. నల్గొండ జిల్లాలో ఘటన

మంచినీటి వాటర్ ట్యాంక్ లో శవం( Dead Body ) కనిపించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.నల్గొండ మున్సిపాలిటీ( Nalgonda Municipality ) పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

 Dead Body In Water Tank Incident In Nalgonda District Details, Dead Body Founded-TeluguStop.com

మున్సిపాలిటీ పరిధిలోని పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంక్ లో( Hindupur Water Tank ) శవం ఉన్నట్లు గుర్తించారు.అయితే గత కొన్ని రోజులుగా ఆ వాటర్ ట్యాంక్ నీళ్లనే పలు వార్డుల ప్రజలు తాగుతున్నారని సమాచారం.

ఈ క్రమంలోనే తాగునీరు తేడాగా ఉండటంతో వాటర్ సప్లై సిబ్బందిని ప్రజలు ప్రశ్నించారు.దీంతో వాటర్ ట్యాంక్ ను పరిశీలించగా సిబ్బంది శవాన్ని గుర్తించారు.దీంతో మున్సిపాలిటీ సిబ్బందిపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు.మృతుడు హనుమాన్ నగర్ కు చెందిన ఆవుల వంశీగా( Avula Vamshi ) గుర్తించారు.

కాగా వంశీ కనిపించడం లేదని గత నెల 24న పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube