సినీ నటి హేమను( Actress Hema ) బెంగళూరు పోలీసులు( Bengaluru Police ) అదుపులోకి తీసుకున్నారు.ఈ మేరకు సీసీబీ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారని తెలుస్తోంది.
బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో గత నెల 20వ తేదీన రేవ్ పార్టీ( Rave Party ) జరిగిన సంగతి తెలిసిందే.కాగా ఈ పార్టీలో నటి హేమ పాల్గొన్నారని పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలోనే నిర్వహించిన డ్రగ్స్ టెస్టులో( Drugs Test ) హేమకు పాజిటివ్ వచ్చింది.దీంతో ఆమెను విచారణకు హాజరు కావాలని కోరుతూ బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు.