వాటర్ ట్యాంక్ లో శవం కలకలం.. నల్గొండ జిల్లాలో ఘటన

మంచినీటి వాటర్ ట్యాంక్ లో శవం( Dead Body ) కనిపించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.

నల్గొండ మున్సిపాలిటీ( Nalgonda Municipality ) పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

మున్సిపాలిటీ పరిధిలోని పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంక్ లో( Hindupur Water Tank ) శవం ఉన్నట్లు గుర్తించారు.

అయితే గత కొన్ని రోజులుగా ఆ వాటర్ ట్యాంక్ నీళ్లనే పలు వార్డుల ప్రజలు తాగుతున్నారని సమాచారం.

ఈ క్రమంలోనే తాగునీరు తేడాగా ఉండటంతో వాటర్ సప్లై సిబ్బందిని ప్రజలు ప్రశ్నించారు.

దీంతో వాటర్ ట్యాంక్ ను పరిశీలించగా సిబ్బంది శవాన్ని గుర్తించారు.దీంతో మున్సిపాలిటీ సిబ్బందిపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు.

మృతుడు హనుమాన్ నగర్ కు చెందిన ఆవుల వంశీగా( Avula Vamshi ) గుర్తించారు.

కాగా వంశీ కనిపించడం లేదని గత నెల 24న పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.