నల్లగొండ జిల్లా: రాష్ట్రంలో పేద ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేర్చేందుకే ప్రజాపాలన అని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు.గురువారం త్రిపురారం మండల కేంద్రంలో జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో ముఖ్యాతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే 6 గ్యారంటీల్లో రెండు గ్యారెంటీలను అమలుపరిచి కాంగ్రెస్ పార్టీకి పేద ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏమిటో నిరూపించిందన్నారు.పేద ప్రజలకు వైద్యం భారం కాకూడదన్న ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.10 లక్షల వరకు పెంచారని,
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించారని తెలిపారు.ప్రజలందరూ 6 గ్యారంటీలను సద్వినియోగ పరుచుకొవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనుముల పాండమ్మ, శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీటీసీ భారతి,భాస్కర్ నాయక్, సర్పంచ్ అనుముల శ్రీనివాస్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు ముడిమల్ల బుచ్చిరెడ్డి,గ్రామ పార్టీ అధ్యక్షుడు అనుముల వెంకటరెడ్డి,ఉప సర్పంచ్ పి.బి.శ్రీనివాస్,మాజీ పాక్స్ చైర్మన్ అనుముల నర్సిరెడ్డి,నియోజకవర్గ ప్రతేక అధికారి రాజ్ కుమార్,మండల ఆధికారులు,పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.