విద్యా సంస్థల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం...!

నల్లగొండ జిల్లా:త్వరలో జరగబోయే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార హడావుడి మొదలైంది.బుధ,గురు వారాల్లో టీచర్ ఎమ్మెల్సీ పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డికి మద్దతుగా సంఘం నాయకులు నల్లగొండ జిల్లాలోని కనగల్,తిప్పర్తి మండలాల్లో ప్రచారం నిర్వహించారు.

 Mlc Election Campaign In Educational Institutions , Educational Institutions , M-TeluguStop.com

అయితే పాఠశాల,కళాశాలల పనివేళల్లో ఎన్నికల ప్రచారం చేయకూడదని ఎన్నికల నిబంధనలు ఉన్నా,జిల్లా కలెక్టర్, ఎన్నికల కమిషన్ హెచ్చరించినా పీఆర్టీయూ జిల్లా నాయకులు బుధవారం కనకల్ జడ్పీహెచ్ఎస్ మరియు పలు పాఠశాలల్లో, గురువారం మర్రిగూడ జిల్లా పరిషత్ పాఠశాల పనివేళల్లో నిబంధనలు తుంగలో తొక్కి ఎన్నికల ప్రచారం నిర్వహించారని, ప్రభుత్వ,ఇతర పాఠశాలల హెడ్మాస్టర్లు ఎన్నికల ప్రచారానికి అనుమతి ఇవ్వడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పీఆర్టీయూ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్ రెడ్డి,మాజీ సెక్రెటరీ గుండు లక్ష్మణ్, నల్గొండ జిల్లా అధ్యక్షుడు డివిఎస్ ఫణికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి జాన్ రెడ్డి,గాదే వెంకటరెడ్డి, అద్దంకి సునీల్ తదితరులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఎన్నికల ప్రచారం చేసినట్టు సమాచారం.రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి పనివేళల్లో పాఠశాలల్లో ఎన్నికల ప్రచారం చేసిన వారిపై,అనుమతిచ్చిన వారిపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలు ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇదే విషయమై పీఆర్టీయూ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు డివిఎస్ ఫణికుమార్ ని వివరణ కోరగా అలాంటిదేమీ లేదని,ఇంటర్వెల్లో కరపత్రాలు ఇచ్చి మద్దతు తెలిపాలని కోరామన్నారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్నికల ప్రచారానికి ఎలా అనుమతి ఇచ్చారని డీఈవో బిక్షపతిని అడగగా అటువంటిది తమ దృష్టికి రాలేదని, ఒకవేళ ఉల్లంఘన జరిగినా అది ఎలక్షన్ కమిటీ బాధ్యతని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube