వీధి కుక్కల దాడిలో మరో జింక మృతి

నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఏకో ఫారెస్ట్ జోన్ లో ఇటీవలే కొన్ని వన్యప్రాణులను వదిలారు.అందులో ఇటీవలే ఓ జింక సమ్మక్క సారక్క గుడి దగ్గర బయటకు వచ్చి వీధి కుక్కల దాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే.

 Another Deer Died In The Attack Of Stray Dogs, Deer Died , Stray Dogs, Deer, Nal-TeluguStop.com

ఆ సంఘటన మరవక ముందే బుధవారం బయటకు వచ్చిన మరో జింక వీధి కుక్కల దాడిలో చనిపోయింది.

పొలంలో కనిపించిన జింక మృతదేహాన్ని చూసిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు జింక మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిర్వహించారు.ఇటీవల కాలంలోనే ఇలా జరగటం ఇది రెండవ సారి కావడంతో ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వన్యప్రాణులను కాపాడాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube