Nalgonda :పట్టణాల నుండి పల్లెలకు పాకిన గంజాయి మహమ్మారి

మర్రిగూడ మండలం( Marriguda )లోని అనేక గ్రామాల యువత గంజాయి మత్తుకు బానిసలై విచక్షణ కోల్పోయి వింతగా ప్రవర్తిస్తున్నారని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఒకప్పుడు పట్టణాలకు పరిమితమైన గంజాయి నేడు మారుమూల పల్లెలకు ఎగబాకి యువశక్తిని నిర్వీర్యం చేస్తుందని, గంజాయిని( Marijuna ) అలవాటుపడిన యువకులు ముందుగా సిగరెట్,మద్యానికి బానిసలై మత్తు డోస్ చాలక గంజాయి వైపుకు ఆకర్షితులై జీవితాలను దుర్భరం చేసుకుంటున్నారని వాపోతున్నారు.

 Nalgonda Marijuana Epidemic Spreading From Towns To Villages-TeluguStop.com

గ్రామశివారు ప్రాంతాలను అడ్డాగా మార్చుకొని గంజాయికి తెగబడుతున్నారని,దానిమత్తుకు బానిసలై తల్లిదండ్రుల,ఇతరుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఆకతాయి పనులకు పాల్పడుతున్నారని,మత్తుకు బానిస అవుతున్న యువత జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు,రేపులు,మర్దర్లు చేయడానికి కూడా వెనుకాడడం లేదని,ఇంట్లో తల్లిదండ్రులకు తెలిసి మందలిస్తే వారిపై తిరగబడుతున్నారని ఆందోళన చెందుతున్నారు.గంజాయి,మద్యపానం,ధూమపానం( Alcohol 0తో యుక్త వయసులోనే అనారోగ్యం పాలవుతున్నారని,వీరిలో 30 ఏళ్లలోపు యువకులే అధికంగా ఉండడంతో మత్తులో రోడ్లపైకి వచ్చి బైకులను ర్యాష్ డ్రైవ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని,వారి వలన ఇతరులకు కూడా ప్రమాదంగా మారిందని, దీనితో అనేక కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని,తమ పిల్లల విషయం తల్లిదండ్రులు బయటకు చెప్పుకోలేక మనోవేదనకు గురవుతున్నారని అంటున్నారు.

ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం ఆయా ప్రాంతాల్లో పోలీస్ నిఘా( Police Security ) ఏర్పాటు చేసి గంజాయి సరఫరా కాకుండా చర్యలు తీసుకోవాలని,మత్తుకు బానిసలవుతున్న యువతను కాపాడాలని తల్లిదండ్రులు,ప్రజలు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube