వీధి కుక్కల దాడిలో మరో జింక మృతి

నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఏకో ఫారెస్ట్ జోన్ లో ఇటీవలే కొన్ని వన్యప్రాణులను వదిలారు.

అందులో ఇటీవలే ఓ జింక సమ్మక్క సారక్క గుడి దగ్గర బయటకు వచ్చి వీధి కుక్కల దాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే.

ఆ సంఘటన మరవక ముందే బుధవారం బయటకు వచ్చిన మరో జింక వీధి కుక్కల దాడిలో చనిపోయింది.

పొలంలో కనిపించిన జింక మృతదేహాన్ని చూసిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు జింక మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిర్వహించారు.

ఇటీవల కాలంలోనే ఇలా జరగటం ఇది రెండవ సారి కావడంతో ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వన్యప్రాణులను కాపాడాలని కోరుతున్నారు.

కొత్తిమీరతో చర్మానికి మెరుగులు.. ఏ సమస్యకు ఎలా వాడాలో తెలుసా?