10 న గ్రూప్ -1 ఫలితాలు...ప్రొవిజనల్ మార్కుల జాబితా వెల్లడి...!

నల్లగొండ జిల్లా:తెలంగాణలో ఉద్యోగ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి భారీ శుభవార్త.తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిజిపీఎస్సీ) పలు కీలక పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నట్టు ప్రకటన జారీ చేసింది.

 Group-1 Results On The 10th Provisional Marks List Revealed, Group-1 Results , P-TeluguStop.com

మార్చి 10 నుంచి గ్రూప్స్ పరీక్షల రిజల్ట్స్ షెడ్యూల్ విడుదల చేసింది.ముందుగా మార్చి 10న గ్రూప్-1 ఫలితాలు విడుదల చేస్తామని వెల్లడించింది.

మార్చి 11న గ్రూప్-2 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్,మార్చి14న గ్రూప్-3 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్ విడుదల చేయనుంది.అలాగే ఈనెల 17న హాస్టల్ వెల్ఫేర్,19న ఎక్స్ టెన్షన్ ఆఫీసరు రిజల్ట్స్ ప్రకటించనుంది.

రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి 21,093 మంది అభ్యర్థులకు నిర్వహించిన మెయిన్స్ పేపర్ వ్యాల్యూయేషన్ ముగిసింది.అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు ప్రారంభించింది.అయితే నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో మరిన్ని ఉద్యోగాలకు పచ్చజెండా ఊపింది.ఇప్పుడు పెండింగ్ లో ఉన్న నోటిఫికేషన్స్ అన్ని త్వరగా క్లియర్ చేసి,కొత్త ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube