నల్లగొండ జిల్లా:నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటైజషన్, సెక్యూరిటీ,పేషంట్ కేరింగ్ సిబ్బంది ఎక్కువగా ఉన్నారని కాంట్రాక్టర్కొందరిని విధుల నుంచి తొలగించిన విషయం అందరికీ తెలిసిందే.దీనిపై గతంలో ఉద్దేశపూర్వకంగా తొలగించారని సదరు తొలగించిన సిబ్బంది ఆందోళనకు దిగిన విషయం కూడా విధితమే.
ఆసుపత్రిలో 180 మంది మాత్రమే ఉండగా ఎక్కువయ్యారనే సాకు చూపి,కాంట్రాక్టర్ చెప్పినట్లు చేయడం లేదనే నెపంతో కావాలనే నలుగురు సిబ్బందిని విధుల నుంచి తొలగించారని ఆరోపణలు వెల్లువెత్తాయి.ఆ వివాదం అలాగే అండగా మళ్లీ సదరు కాంట్రాక్టర్ కొత్త దందాకు తెరలేపారని కొందరు సిబ్బంది ఆరోపిస్తున్నారు.
అప్పుడు ఎక్కువయ్యారని తొలగించి ఇప్పుడేమో తక్కువయ్యారని కొత్తగా 13 మందిని ఒక్కొకరి దగ్గర లక్షల రూపాయలు తీసుకుని రిక్రూట్మెంట్ చేసుకున్నట్లు ఆరోపించారు.ఇందులో కూడా పోస్టింగ్ కు ఒక్కో విధంగా ఒక రేటు పెట్టి బయటవారిని కాకుండా కాంట్రాక్టర్ కు దగ్గర సంబంధాలు కలిగిన వారికి,వారి కుటుంబ సభ్యులకు ఈ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు,శానిటైజషన్,సెక్యూరిటీ పోస్టుకు రూ.1,20,000, పేషంట్ కేర్ పోస్టుకు రూ.1,50,000 చొప్పున లక్షల్లో కాంట్రాక్టర్ దండుకుంటున్నాడని తెలుస్తోందన్నారు.ఇదిలా ఉండగా ఆస్పత్రిలో పనిచేస్తున్న సూపర్వైజర్ల హడావిడి సిబ్బందిపై అంతా ఇంతా కాదని,వీరు చెప్పిందే వేదమని,వారు చెప్పింది చేయాల్సిందేనని,వీరికి నచ్చిన వారికి అఫీషియల్ డ్యూటీలు వేస్తున్నారని, సూపర్వైజర్లతో మహిళా సిబ్బంది చనువుగా ఉండి,తమకు నచ్చే విధంగా ఉండాలని, చెప్పింది చేయాలని హుకుం జారీ చేస్తారని, వీరికి నచ్చిన విధంగా ఉన్నవారికి మాత్రం తూతూ మంత్రంగానే పనులు చెబుతూ,వీరి మాట విననివారికి నరకం చూపిస్తారని,ఈ విషయంపై ఎన్నో విధాలుగా సిబ్బంది మొరపెట్టుకున్నా కాంట్రాక్టర్ ఏమాత్రం పట్టించుకోవడంలేదని,ఇంత జరుగుతున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ విషయాలపై దృష్టి సాధించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగే అక్రమాలను మరియు అహంకార పూరితమైన సూపర్వైజర్ల దుర్మార్గాలను అరికట్టాలని సిబ్బంది కోరుతున్నారు