జూన్ 5న రాష్ట్ర వ్యాప్త సమ్మెకు సిద్దం

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థలో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారం కోసం జూన్ 5న నుండి రాష్ట్ర వ్యాప్త సమ్మె బాట పట్టనున్నట్లు నల్లగొండ( Nalgonda ) రేషన్ డీలర్స్ అధ్యక్షుడు పారేపల్లి నాగరాజు అన్నారు.చాలీచాలని కమిషన్లతో గత 40 సంవత్సరాలుగా పని చేస్తూ ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ గడవక పనిచేస్తున్న రేషన్ డీలర్లు డిమండ్లను పరిష్కరించాలని రాష్ట్ర ఐక్య జేఏసి తీర్మానం మేరకు జూన్ 5 సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలోనల్గొండ రేషన్ డీలర్ల అధ్యక్షుడు పారెపల్లి నాగరాజు ( Nagaraju )అధ్వర్యంలోమంగళవారం కలెక్టరేట్ ఎవో మోతీలాల్,ఏఎస్ఓ యశ్వంత్ కు సమ్మె నోటీసుతో పాటు, సమస్యల వినతిపత్రాన్ని అందజేశారు.

 Ration Dealers Prepare For Statewide Strike On June 5  ,ration Dealers , Strike,-TeluguStop.com

ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుండి తమ సమస్యలను ప్రభుత్వ యంత్రాంగం రాష్ట్ర మంత్రులు,ప్రజా ప్రతినిధులకు అనేకసార్లు విన్నవించినా ఇప్పటివరకు ఏలాంటి న్యాయం జరగలేదన్నారు.పెరిగిన జీవన ప్రమాణాలకు అనుగుణంగా కుటుంబాల పోషణ చాలా కష్టంగా ఉందని,డీలర్ వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నంగా మారిందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని డీలర్ల ఐక్య కార్యాచరణ కోరుతూ ఏప్రిల్ 20న రాష్ట్ర పౌరసరఫరాల కమీషన్ కు విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు.రాష్ట్ర జేఏసి పిలుపు మేరకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా రేషన్ డీలర్లు సమ్మె బాట పట్టనున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రేషన్ డీలర్లు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube