జాతీయ మైనార్టీ కమీషన్ సభ్యురాలిపై దాడి పరిస్థితి ఉద్రిక్తం...!

నల్లగొండ జిల్లా: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహంచిన సమావేశానికి హాజరైన జాతీయ మైనార్టీ కమీషన్ సభ్యురాలు సయ్యద్ షేహజాదిపై దాడి జరగడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి,ఎస్పీ అపూర్వరావు కూడా హాజరైనారు.

 Attack On Member Of The National Minority Commission In Nalgonda, National Mi-TeluguStop.com

ఈ సమావేశంలో కేంద్రం ప్రభుత్వం మైనార్టీ సంక్షేమం కోసం అమలు చేస్తున్న 15 సూత్రాల పథక సమీక్ష మైనార్టీలు ఎదురుకుంటున్న సమస్యలపై చర్చ నిర్వహించారు.

సమావేశం మధ్యలో కలెక్టర్,ఎస్పీలు ఇతర కార్యక్రమాల నేపథ్యంలో బయటికి వెళ్ళగా, మైనార్టీల సమస్యలపై చర్చ జరుగుతున్న సందర్భంగా ఒక వ్యక్తి సుదీర్ఘంగా మాట్లాతుండగా ఇతరులకు అవకాశం ఇవ్వాలని షేహజాది సూచించారు.

దీనితో ఆగ్రహించిన సదరు వ్యక్తి ఆమెపై దాడికి యత్నించి, ఆమె పిఏపై చేయి చేసుకున్న ఘటన సమావేశంలో గందరగోళం సృష్టించింది.

జరిగిన ఘటనపై జాతీయ మైనార్టీ కమీషన్ సభ్యురాలు షేహజాది జిల్లా ఎస్పీ అపూర్వరావుకు ఫిర్యాదు చేశారు.

తాము ముస్లిం మైనార్టీ సమస్యలు తెలుసకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న మైనార్టీ సంక్షేమ పథకాలు వారికి అందుతున్న తీరును సమీక్షించేందుకు దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు తెలిపారు.దాడికి పాల్పడిన వ్యక్తిపై చట్ట పరమైన చర్యలు తీసుకోని,ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆమె కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube