ప్రస్తుత కాలంలో వివాహ కార్యక్రమాలకు( Wedding ) సంబంధించిన ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చూస్తూనే ఉన్నాము.ముఖ్యంగా పెళ్లిలో జరిగే సరదా సంఘటనలు, అలాగే స్టేజిపై వధూవరులు ఇద్దరు చేసే డాన్స్ కు సంబంధించిన వీడియోలు ఈ మధ్యకాలంలో మరి ఎక్కువగా కనబడుతున్నాయి.
తాజాగా ఈ లిస్టులో మరో వీడియో కూడా చేరింది.వధువు, వరుడు డీజే పాటకు వారి ఊరేగింపులో డాన్స్( Dance ) చేస్తున్న సమయంలో అనుకోని సంఘటన సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఇక ఈ వీడియో గురించి పూర్తి వివరాలు చూస్తే.
వివాహ కార్యక్రమంలో వధూవరులతోపాటు వారి బంధువుల మధ్యలో అందరూ రోడ్డు పై పాటకు తగ్గట్టుగా డాన్సులు వేస్తూ ఉంటారు.డాన్స్ చేస్తున్న సమయంలో వధూవరులు ఇద్దరు పోటీ పోటీగా డాన్స్ చేయడం వీడియోలో గమనించవచ్చు.వారి డాన్స్ చూసి చుట్టుపక్కల వారందరూ ఎంకరేజ్ చేస్తుండగా మరికొందరు వారితో పాటు కలిసి డాన్స్ చేయడం కూడా గమనించవచ్చు.
అయితే అందరూ డాన్స్ చేస్తూ ఉత్సాహంగా ఉన్న సమయంలో అనుకోని ఓ ఫన్నీ సంఘటన జరిగింది.డాన్స్ చేస్తున్న సమయంలో ఉన్నట్లుండి ఓ వ్యక్తి వరుడి తలపాగాను పక్కకు తీసేసాడు.
ఇంకేముంది అతడు బాగా దాచిపెట్టుకున్న అతడి బట్టతల( Bald Head ) బయటపడింది.దీంతో ఒక్కసారిగా వరుడు షాక్ గురవుతాడు.వరుడు( Groom ) వెంటనే తేరుకొని తలపాగాను( Turban ) అతని చేతి నుంచి లాగేసుకుని మళ్లీ తన తల మీద పెట్టుకుంటాడు.
అయితే ఆ సమయంలో వధువు( Bride ) తలదించుకొని డాన్స్ చేస్తుంటే.సరిపోయింది కానీ లేకపోతే వధువు ముందర కూడా వరుడి పరువు తీసేసినట్లు అయ్యేది.అలా బట్టతల బయటపడడంతో వరుడు పక్కన ఉన్న వారి బంధువులు కూడా నవ్వడం మొదలుపెట్టారు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన మెటీరియల్స్ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.అందులో కొందరైతే ఏంటి భయ్యా.మొత్తానికి వరుడి గాలి తీసేసావుగా అంటుండగా మరికొందరైతే ఎన్నాళ్ళ నుంచి అతడి మీద కోపం పెట్టుకున్నట్లు ఉన్నావు అందుకే కాబోలు ఇలా చేసి ఉంటావని కామెంట్ చేస్తున్నారు.