తెలంగాణ ఉద్యమకారుడు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కీలక నేత డాక్టర్ చెరుకు సుధాకర్ సొంతగూటికి చేరారు.ఈ మేరకు తెలంగాణభవన్ లో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ క్రమంలో చెరుకు సుధాకర్ కు మంత్రులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా చెరుకు సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జైలు జీవితం గడిపానని తెలిపారు.
తన ఆలోచనా విధానానికి పదునుపెట్టింది తెలంగాణ భవన్ అన్న ఆయన ప్రాంతీయ పార్టీగా పుట్టిన బీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించడం గొప్ప విషయమని వెల్లడించారు.బీఆర్ఎస్ భవిష్యత్ లో మరింతగా రాణించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.