నైపుణ్యం కలిగిన విదేశీ వృత్తి నిపుణులు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్ 1 బీ వీసాలకు( H1B visas ) సంబంధించి ఎప్పుడూ ఏదో వివాదం వుంటూనే వుంటుంది.ఏటా హెచ్-1బీ వీసాల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి.
వీటిలో కంప్యూటర్ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65వేల దరఖాస్తులను ఎంపిక చేసి అమెరికా వీసా జారీ చేస్తుంది.వీటితో పాటు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ ( STEM ) విభాగాల్లో అమెరికా యూనివర్శిటీల్లో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు మరో 20వేల వీసాలు ఇస్తారు.
అంటే మొత్తం 85 వేల హెచ్ 1 బీ వీసాలన్న మాట.

ఇంతటి ఈ ప్రతిష్టాత్మక వీసాలో కొన్ని మార్పులు తీసుకురావాలని బైడెన్( Biden ) యంత్రాంగం భావిస్తోంది.అర్హతను క్రమబద్ధీకరించడం, ఎఫ్ 1 విద్యార్ధులు, వ్యవస్థాపకులు, లాభాపేక్ష లేని సంస్థల కోసం పనిచేసే వారికి మరింత సౌలభ్యాన్ని అందించడం, ఇతర వలసేతర కార్మికులకు మెరుగైన స్థితిని కల్పించాలని యోచిస్తున్నారు.దీని సామర్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు హెచ్ 1 బీ ఫారిన్ వర్కర్స్ ప్రోగ్రామ్‌లో మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ( US Citizenship and Immigration Services )(యూఎస్‌సీఐఎస్) ఈ నెల 23న ఫెడరల్ రిజిస్టర్‌లో నియమాలు, వీసాల సంఖ్యకు సంబంధించిన అంశాలను ప్రచురించనుంది.

నిబంధనలలో ప్రతిపాదిత మార్పులు, ప్రోగ్రామ్ సామర్ధ్యాన్ని మెరుగుపరచడం, యజమానులు, కార్మికులకు ఎక్కువ ప్రయోజనాలను అందించడం లక్ష్యంగా వున్నాయని హోంలాండ్ సెక్యూరిటీ పేర్కొంది.గ్లోబల్ టాలెంట్‌ను ఆకర్షించడం, యజమానులపై అనవసరమైన భారాలను తగ్గించడం, ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో మోసం, దుర్వినియోగాన్ని నిరోధించడం బైడెన్ హారిస్ అడ్మినిస్ట్రేషన్ ప్రాధాన్యత అని హోంలాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెజాండ్రో ఎన్ మయోర్కాస్( Alejandro N Mallorcas ) ఒక ప్రకటనలో తెలిపారు.ప్రతిపాదిత నియమం ప్రకారం.
నిర్దిష్ట లాభాపేక్ష లేని సంస్థలు , ప్రభుత్వ పరిశోధనా సంస్థలు, అలాగే అర్హత పొందిన సంస్థ ద్వారా నేరుగా ఉద్యోగం పొందని లబ్ధిదారులకు హెచ్ 1 బీ పరిమితిపై కొన్ని మినహాయింపులు లభించనున్నాయి.అలాగే విద్యార్ధులు తమ స్టేటస్‌ను హెచ్ 1 బీకి మార్చాలని కోరినప్పుడు ఎఫ్ 1 వీసాపై( F1 visa ) వున్న విద్యార్ధులకు కూడా డీహెచ్‌ఎస్ నిర్దిష్ట సౌలభ్యాన్ని కూడా అందిస్తుంది.
రోజురోజుకు కొత్తగా వస్తున్న వ్యాపారవేత్తల అవసరాలను దృష్టిలో వుంచుకుని డీహెచ్ఎస్ మరిన్ని వెసులుబాట్లు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.